Kumaram Bheem: నాన్న.. ప్లీజ్ నన్ను కాపాడు.. తండ్రితో బాలిక చివరి మాటలు..

Asifabad Student Death: పదో తరగతి చదువుతున్న ఆ బాలిక.. ప్లీజ్ నాన్న నన్ను కాపాడంటూ చెప్పిన మాటలు.. ఆ తండ్రి గుండె పగిలేలా చేశాయి. అసలేం జరిగిందంటే..

Asifabad Student Death: పదో తరగతి చదువుతున్న ఆ బాలిక.. ప్లీజ్ నాన్న నన్ను కాపాడంటూ చెప్పిన మాటలు.. ఆ తండ్రి గుండె పగిలేలా చేశాయి. అసలేం జరిగిందంటే..

ఆ తల్లిదండ్రులకు బిడ్డ అంటే ప్రాణం. కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతుంది. బిడ్డను బాగా చదవించాలని భావించిన తల్లిదండ్రులు.. ఆమెను హస్టల్లో జాయిన్ చేశారు. తరచుగా వెళ్లి చూసి వచ్చేవారు. ఇక అంత బాగుంది అనుకున్న సమయంలో.. ఆ బాలిక.. ప్రాణాలతో పోరాడుతూ..  ‘నాన్నా.. ప్లీజ్ నన్నెలాగైనా కాపాడు’ అంటూ తండ్రితో పలికిన మాటలు ఆ కన్నపేగును మెలిపెట్టాయి. బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ తండ్రి తన శాయశక్తులా ప్రయ్నతించాడు. కానీ విధి ముందు ఓడిపోక తప్పలేదు. కుమార్తె మృతిని తట్టుకోలేకపోయిన తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’ అంటూ గుండెలు పగిలేలా రోదించాడు. ఈ విషాద ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేటలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలో పెరుగుతున్న విష జ్వరాలకు మరో బాలిక మృత్యువాత పడింది. హాస్టల్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థిని తీవ్ర జ్వరంతో బాధపడుతూ కన్ను మూసిన వైనం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆ వివరాలు..

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేటరే చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) ఆసిఫాబాద్‌లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల హస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతుంది. ఇలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం పూజకు జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్‌ చేసింది.

‘నాన్నా నాకు జ్వరమొచ్చింది. చేతనైతలేదు. కాళ్లు చేతులు లాగుతున్నాయి ఇంటికి తీసుకు వెళ్లు’ అని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

శనివారం మధ్యాహ్నం నాటికి పరిస్థితి మరింత విషమించింది. దాంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. హైదరాబాద్ కు వస్తుండగా.. మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని ప్లీజ్ నాన్న నన్ను ఎలాగైనా కాపాడు అంటూ వేడుకుంది. బిడ్డ మాటలకు ఆ తండ్రి ప్రాణం విలవిల్లాడింది. ఏమీ కాదని బిడ్డకు ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. పూజ మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా గత కొంత కాలంగా గుండాయిపేట గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. తాజాగా పూజ మరణంతో గ్రామంలోని వారంతా భయాందోళనకు గురవుతున్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Show comments