తెలంగాణలో జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్.. నోటిఫికేషన్స్, పరీక్షల షెడ్యూల్ ఇదే!

Telangana Job Calendar: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అందించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Telangana Job Calendar: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అందించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

గత ఏడాది తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణ  ముఖ్యమంత్రిగా రేవత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజునే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట, మేనిఫెస్టో తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని పలు సందర్భాల్లో తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.  ఇప్పటికే ‘మహాలక్ష్మి’ , ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకాలు ప్రారంభించారు. వాటితో పాటు 200 ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేశారు. మరోవైపు రైతులకు రుణమాఫీ చేశారు. తాజాగా అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్, పరీక్షల తేదీలను జాబ్ క్యాలెండర్ లో వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్‌-2ను డిసెంబరులో, గ్రూప్‌-3 నవంబరులో నిర్వహించనున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలను కూడా వెల్లడించారు.

నోటిఫికేషన్స్, పరీక్షల షెడ్యూల్ ఇదే:

  • వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల… నవంబర్‌లో పరీక్షలు.
  • ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు
  • నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు
  • వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్‌లో పరీక్షలు
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ .. మేలో పరీక్షలు
  • గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు
  • ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు
  • డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్..సెప్టెంబర్‌లో పరీక్షలు
  • వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు
  • వచ్చే ఏడాది జులైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్ నవంబర్‌లో పరీక్షలు
  • సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్షలు
  • పోలీసు శాఖలో ఎస్సై సివిల్ పోస్టులకు ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో పరీక్షలు
Show comments