nagidream
Telangana IT Minister Sridhar Babu On Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. 30,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని అన్నారు. పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
Telangana IT Minister Sridhar Babu On Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. 30,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని అన్నారు. పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
nagidream
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గానీ అల్టిమేట్ గా జనాలు కోరుకునేది ఉద్యోగ, ఉపాధి అవకాశాలే. అవి నెరవేర్చేందుకే ప్రభుత్వాలు పని చేస్తాయి. ఏటేటా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలు, గ్రామాల నుంచి హైదరాబాద్ కి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు కంపెనీలతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో చర్చలు జరిగాయని.. 19 కంపెనీలతో 31,500 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
దక్షిణ కొరియాలో 12 సంస్థలతో చర్చలు జరిపామని.. తెలంగాణలో త్వరలోనే 30,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ పర్యటనలో ఏఐ, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ పై చర్చలు జరిపినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎటువంటి భేషజాలు లేకుండా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు అందేలా పని చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన మంచిని అలానే కొనసాగిస్తామని అన్నారు. దావోస్ పర్యటనలో చేసుకున్న 40 వేల కోట్ల పెట్టుబడులపై అధికారులు ఇప్పటికీ ఆయా సంస్థలతో టచ్ లో ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లడం లేదని.. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫాక్స్ కాన్ సంస్థ ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశారు.
కొన్ని కంపెనీలు ఆయా సంస్థల విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి అని.. వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేసేందుకు ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తామని.. బీఆర్ఎస్ నేతలనే కాకుండా వారి బంధువులు వచ్చినా ఆహ్వానిస్తామని అన్నారు. తెలంగాణలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని అన్నారు. అలానే బయోడిజైర్ సిటీని ఏర్పాటుపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని కోరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మూసీ నది పునరుజ్జీవం కోసం అధ్యయనాలు చేశామని.. సుందరీకరణపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో చర్చించినట్లు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.