Group 4 Merit List: గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల.. ఆ ప్రాంతాల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని వివిధ గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం గతంలో రాత పరీక్షను నిర్వహించింది. గ్రూప్4 మెరిట్ జాబితాను తాజాగా విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని వివిధ గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం గతంలో రాత పరీక్షను నిర్వహించింది. గ్రూప్4 మెరిట్ జాబితాను తాజాగా విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం గ్రూప్-1 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి.. తాజాగా మరోసారి తిరిగి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలను ఎంతో పక్బంధీగా నిర్వహించారు. ఇది ఇలా ఉంటే.. టీఎస్స్పీఎస్సీ గ్రూప్4 మెరిట్ జాబితాను తాజాగా విడుదల చేసింది. దీంతో గ్రూప్4 రాసిన అభ్యర్థులు ఫలితాలను చూసుకుంటున్నారు. ఇక మెరిట్ జాబితా విడుదల అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేష్ ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని వివిధ గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం గతంలో రాత పరీక్షను నిర్వహించింది. ఈ పోస్టులలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ వంటి ఇతర పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్4 పరీక్షలను 2023 జూలై ఒకటిన నిర్వహించారు. మొత్తం 8039 ఖాళీల కోసం గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. తాజాగా అందుకు సంబంధించిన మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు గ్రూప్4  పై క్లిక్ చేసి మెరిట్ లిస్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక గ్రూప్ 4 తుది జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. ఇక టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రకారం…మెరిట్ జాబితా ఉన్న అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేశారు.

ఇక మెరిట్ జాబితకు ఎంపికైన వారికి పలు ప్రాంతాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ హైదరాబాద్‌లో రెండు ప్రాంతాల్లో జరగనుంది. ఒకటి టీఎస్పీఎస్సీ భవన్, రెండోది నాంపల్లిలోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు.  ఎవరు ఎప్పుడు ధృవీకరణ పత్రాల పరిశీలనకు రావాలి అనేది త్వరలో అభ్యర్థులకు తెలియజేస్తారు. అంతేకాక అభ్యర్థులకు రోజు వారీ షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాథమిక సమాచారం అన్ని పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి.

గ్రూప్ 4 దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ PDF, ఆ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్, పదో తరగతి మార్కుల మెమో సహా ఇతర స్వీయ ధృవీకరించబడిన పత్రాలు ఉండాలి. అలానే ఫోటోకాపీల సెట్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్‌లను తప్పనిసరిగా వెరిఫికేషన్ టైమ్ లో తీసుకురావాల్సి ఉంటుంది. అలానే అభ్యర్థులకు కీలకమైన వెబ్  ఆప్షన్ లను 2024 జూన్ 13వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. ఇకస ఈ వెబ్ విధానం ద్వారా అభ్యర్థులు జిల్లాలు, పోస్టుల వారీగా ఛాయిస్ ను ఎంచుకోనున్నారు. చివరకు ఎంపికైన అభ్యర్థులు పంచాయతీ రాజ్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌తో సహా వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్‌గా పోస్ట్ చేయబడతారు. ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. అభ్యర్థులు తమ ఎంపికలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Show comments