iDreamPost
android-app
ios-app

TSPSC: గ్రూప్-2 పరీక్ష వాయిదా! కొత్త కమిషన్ వచ్చాకే పరీక్ష తేదీల ప్రకటన?

  • Published Dec 28, 2023 | 8:26 AM Updated Updated Dec 28, 2023 | 8:26 AM

గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న తెలంగాణ గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. దీంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నారు.

గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న తెలంగాణ గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. దీంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నారు.

TSPSC: గ్రూప్-2 పరీక్ష వాయిదా! కొత్త కమిషన్ వచ్చాకే పరీక్ష తేదీల ప్రకటన?

గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న తెలంగాణ గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. దీంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నారు. గతంలో పలు మార్లు వాయిదా పడిన ఈ ఎగ్జామ్, మరోసారి వెనక్కి వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 6,7వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. కానీ TSPSC చైర్మన్ తో సహా మరో ముగ్గురు సభ్యులు రాజీనామలు చేయడంతో ఎగ్జామ్ నిర్వహణ కష్టంగా మారింది. దీంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది బోర్డు. ఇందుకు సంబంధించి టీఎస్ పీఎస్సీ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. త్వరలోనే కొత్త డేట్స్ ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. TSPSC చైర్మన్ తో పాటుగా మరికొంత మంది సభ్యులు రాజీనామ చేయడంతో పరీక్షల నిర్వహణ కష్టమైంది. దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 6,7 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా సమస్యలు తలెత్తడంలో ఎగ్జామ్స్ ను వాయిదావేయకతప్పలేదు. నూతన కమిషన్ ఏర్పాటు చేశాకే కొత్త తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో 18 డిపార్ట్ మెంట్లలో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్ పీఎస్సీ నోటిఫికెషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 783 ఉద్యోగాల కోసం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. తొలుత ఆగస్టు 29,30 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కానీ అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ 2,3 తేదీలకు పరీక్షను రీ షెడ్యూల్ చేశారు. అయితే నవంబర్ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. వాయిదాల పర్వం మెుదలైంది. ఇక ఈ విషయంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురౌతున్నారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి పరీక్షలు సిద్దమవుతుంటే.. ఇలా వాయిదాలు పడటం మనోవేదనకు గురిచేస్తుందని పలువురు అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.