iDreamPost
android-app
ios-app

Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. యాక్సిడెంట్‌ బాధితులకు రూ.లక్ష వరకు

  • Published Jun 19, 2024 | 11:02 AM Updated Updated Jun 19, 2024 | 11:02 AM

రేవంత్‌ సర్కార్‌ యాక్సిడెంట్‌ బాధితులకు మేలు కలిగేలా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

రేవంత్‌ సర్కార్‌ యాక్సిడెంట్‌ బాధితులకు మేలు కలిగేలా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

  • Published Jun 19, 2024 | 11:02 AMUpdated Jun 19, 2024 | 11:02 AM
Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. యాక్సిడెంట్‌ బాధితులకు రూ.లక్ష వరకు

తెలంగాణలో అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ రెడ్డి.. పాలనలో తనదైన మార్కు చూపిస్తూ.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలను అమలు చేస్తున్నారు. అలానే ప్రజా సంక్షేమం కోసం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాల మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. వారు మరణిస్తే లోన్‌ కట్టే అవసరం లేదు.. పైగా మరణించిన వ్యక్తికి 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా యాక్సిడెంట్‌ బాధితుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి అత్యవసరంగా లక్ష రూపాయల వరకు మేలు చేసేలా నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు చేపడుతోంది. ఆ వివరాలు.

మన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వీటిపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. మనం జాగ్రత్తగానే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు అధికం అవుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదంలో చనిపోతే అది ఒకలాంటి బాధ అయితే.. గాయపడ్డ వారికి చికిత్స అందించడం మరింత కష్టమైన ప్రక్రియగా మారింది. యాక్సిడెంట్‌లో గాయపడ్డ వారికి వైద్యం అందించాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండరు.. ప్రైవేటు హస్పిటల్‌కు వెళ్తే.. అక్కడ వారు లక్షల్లో బిల్లు వసూలు చేస్తారు. ఈ క్రమంలో యాక్సిడెంట్‌ బాధితుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. యాక్సిడెంట్‌కు గురైన బాధితులకు సత్వరమే వైద్యం సాయం అందిచటంతోపాటు ఆర్థిక వెసులుబాటు కలిగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. యాక్సిడెంట్‌ బాధితులకు కోరుకున్న ఆసుపత్రుల్లో రూ.లక్ష వరకు ఉచిత వైద్యం అందించే దిశగా.. చర్యలు తీసుకోవడానికి రేవంత్‌ సర్కార్‌ రెడీ అవుతోంది. దీనిపై కసరత్తు జరుగుతుందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడిస్తామని తెలంగాణ వైద్యోరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

ఈ పథకం నిబంధనల ప్రకారం యాక్సిడెంట్‌కు గురైన క్షతగ్రాతులను ప్రైవేటు హాస్పిటల్‌కు తరలిస్తే.. వారికి రూ. ఒక లక్ష వరకు ఉచితంగా ట్రీట్‌మెంట్ అందించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే పనిలో ఉన్నామన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పథకాన్ని తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. యాక్సిడెంట్ బాధితులను ఆదుకునేందుకు మానవతా ధృక్పథంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి దామోదర వెల్లడించారు.