iDreamPost
android-app
ios-app

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ఘటనతో అప్రమత్తం! తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం!

  • Published Sep 03, 2024 | 2:00 PM Updated Updated Sep 03, 2024 | 2:10 PM

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం ఘటన యావత్తు దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెంలగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం ఘటన యావత్తు దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెంలగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Sep 03, 2024 | 2:00 PMUpdated Sep 03, 2024 | 2:10 PM
కోల్‌కతా ట్రైనీ డాక్టర్  ఘటనతో అప్రమత్తం!  తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం!

ఇటీవలే కోల్‌కతాలో జరిగిన  ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతనెల ఆగస్టు 9వ తేదీదన  కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్ లో ఓ జేనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. కాగా, ఆమెపై ఆత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది. ఇక ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలకు పెద్ద ఎత్తునే నిరసనలు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు.  అసలు రోగులను కాపాడాల్సిన వైద్యురాలికే ఇంతటి కష్టం వచ్చిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతలా ఈ ఘటన యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కోల్‌కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో తాజాగా తెంలగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేసి మహిళా డాక్టర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్‌లో షీ టీంలతో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించేలా నిబంధనలు రూపొందించాలన్నారు. దీంతో పాటు తెలంగాణలోని అన్ని బోధనాసుపత్రుల్లో పర్మినెంట్ ప్రాతిపాదికన పోలీసు అవుట్‌పోస్టులను ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టంచేశారు.

ఇదిలా ఉంటే.. ఈ మేరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ , మెడికల్ కాలేజీల్లో వైద్య సిబ్బంది భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై సోమవారం (సెప్టెంబర్ 2) సెక్రటేరియట్‌లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  అయితే ఈ సమీక్షలో హోం శాఖ కార్యదర్శి రవి గుప్తా, ఎస్పీఎఫ్‌ అదనపు డీజీ అనిల్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది భద్రతకు పెద్దపీట వేయాలని మంత్రి సూచించారు. అయితే అందుకు తగిన మార్గం  రాత్రి సమయంలో షీ టీంలతో పెట్రోలింగ్ నిర్వహించటం ద్వారా భరోసా కలుగుతుందని తెలిపారు. దీంతో హాస్పిటల్ లో ఉన్న రోగులుకు మంచి జరుగుతుందని, అలాగే చిన్న పిల్లల కిడ్నాప్ లను కూడా నివారించవచ్చని మంత్రి దామోదర పేర్కొన్నారు.