iDreamPost
android-app
ios-app

Revanth Reddy: తెలంగాణ సర్కార్‌ మరో శుభవార్త.. మహిళలకు రూ.90 వేల నుంచి రూ.10 లక్షలు.. వీరే అర్హులు

  • Published Jul 08, 2024 | 12:29 PM Updated Updated Jul 08, 2024 | 12:29 PM

Mahila Shakti Scheme: తెలంగాణలోని మహిళల కోసం రేవంత్‌ సర్కార్‌ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ స్కీమ్‌ కింద 90 వేల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

Mahila Shakti Scheme: తెలంగాణలోని మహిళల కోసం రేవంత్‌ సర్కార్‌ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ స్కీమ్‌ కింద 90 వేల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jul 08, 2024 | 12:29 PMUpdated Jul 08, 2024 | 12:29 PM
Revanth Reddy: తెలంగాణ సర్కార్‌ మరో శుభవార్త.. మహిళలకు రూ.90 వేల నుంచి రూ.10 లక్షలు.. వీరే అర్హులు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మహిళా సాధికారిత కోసం కృషి చేస్తోంది. వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది.. తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా చేయడం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో మహిళల కోసమే ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రమే కాక.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్‌ సర్కార్‌ మహిళలకు మరో శుభవార్త చెప్పింది. అర్హులైన వారికి 90 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇంతకు ఇది ఏ పథకం.. దీనికి ఎవరు అర్హులు అంటే..

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వం ప్రధాన ద్యేయం అని చెబుతోన్న రేవంత్‌ సర్కార్‌.. వారి కోసం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టే బాధ్యతను ఇప్పటికే మహిళా సంఘాలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అలానే గ్రామాల్లో కూడా మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోన్న సర్కార్‌.. వాటి బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదే కాక అంగన్‌వాడీ విద్యార్థులకు యూనిఫాం ప్రవేశపెట్టిన సర్కార్‌.. ఆ బాధ్యతను కూడా డీఆర్‌డీఏకే అప్పగించింది. వీటిత పాటు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలతో పాటుగా.. వారికి బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. ఈక్రమంలో మరో కొత్త పథకానికి తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలోని మహిళ సంఘాల సభ్యులను మరింత బలోపేతం చేయడం కోసం రేవంత్‌ సర్కార్‌ కొత్త పథకం అమలుకు రెడీ అయ్యింది. మహిళా శక్తి పథకం కింద.. వారికి పాడి పశువులు, నాటు కోళ్ల పెంపకం, పైల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, పాల కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలు మంజూరు చేయాలని నిర్ణయించడమే కాక.. కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాడి, పౌల్ట్రీ, చేపల విక్రయ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వమే బ్యాంకులు, మండల మమిళా సమాఖ్యాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లా వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింద.ఇ

దీనిలో భాగంగా మండలానికి ఒకటి చొప్పున పౌల్ట్రీ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని.. ఇందుకు 2.91 లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సొంత జాగా ఉండి.. షెడ్డు వేసుకుని… కోళ్ల ఫామ్‌ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చేవారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇక నాటుకోళ్ల పెంపకంలో భాగంగా.. ఒక్కో జిల్లాలో సుమారు 2 వేల మందికి.. రూ.3 కోట్ల విలువైన కోళ్లు సరఫరా చేస్తారు. ఇందుకు ఒక్కో సభ్యురాలుకు రూ.15 వేల చొప్పున రుణం మంజూరు చేస్తారు. ఈ పథకం కింద 20, 50, 100 దేశవాలీ కోళ్లను మంజూరు చేస్తారు.

పాడి పశువుల యూనిట్ల ఏర్పాటులో భాగంగా ప్రతీ జిల్లాకు రూ.4.50 కోట్లతో 500 మంది మహిళా సమాఖ్యల సభ్యులకు మంజూరు చేస్తారు. దీనిలో భాగంగా మహిళా సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి రూ.90 వేల రుణసాయం అందజేస్తారు.

అలానే మండలానికి ఒకటి చొప్పున మహిళా సంఘాలకు మిల్క్‌ పార్లర్లు మంజూరు చేస్తారు. బస్టాండ్లు, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, రైల్వే స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో సంఘాల సభ్యురాళ్లు పాల కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందు కోసం ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల రుణం మంజూరు చేస్తారు.

సంచార చేపల విక్రయ కేంద్రాలు కూడా మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల రుణంతో మండలానికి ఒక యూనిట్‌ ఇస్తారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మత్స్య సంపత్‌ యోజన కింద 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. కనుక అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.