P Venkatesh
కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే?
కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే?
P Venkatesh
కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. సదాశివపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గతేడాది లాస్య నందిత తండ్రి సాయన్న మృతి చెందగా ఏడాది తిరక్కుండానే కూతురు మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, రాజకీయ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.కాగా ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లకు త్వరలోనే ఫిట్ నెస్ పరీక్షలు చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అనుభవం లేని డ్రైవర్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని, వీరి కారణంగా వీఐపీలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల డ్రైవర్లకు టెస్టులు పెడతామని మంత్రి తెలిపారు. డ్రైవింగ్ నైపుణ్యం లేని డ్రైవర్లను విధుల్లో పెట్టుకోవద్దని ఈ సందర్భంగా మంత్రి పొన్నం సూచించారు.