Telangana Govt-Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎన్ని ఎకరాలలోపు అంటే

Rythu Bharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎన్ని ఎకరాలలోపు అంటే

Telangana Govt-Rythu Bharosa,Guidelines: రైతు భరోసా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అన్నదాతలకు కీలక అప్డేట్. ఈ పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Telangana Govt-Rythu Bharosa,Guidelines: రైతు భరోసా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అన్నదాతలకు కీలక అప్డేట్. ఈ పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసుకుంటూ మందుకు సాగుతుంది. దీనిలో భాగంగా తాజాగా ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా.. రూ.2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేశారు. ఇందుకోసం ఏకంగా 31 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇక ఈ హామీ అమలు తర్వాత అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మరో హామీ.. ఎకరాకి ఇంత అని అందించే పెట్టుబడి సాయం అందించే పథకం రైత భరోసా.

గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో దీన్ని అమలు చేసింది. దీని కింద ఎకరాకు 5 వేల రూపాయల పెట్టుబడి సాయం అందజేస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్పుతో పాటు.. దీని ద్వారా అందించే మొత్తాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు రూ. 15 వేలు అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకం అమలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక అప్డేట్ వెలువడింది. ఆ వివరాలు..

ఇక ఈ పథకాన్ని ఈ ఏడాది దసరా నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. రెండు విడతల్లో ఎకరాకు రూ. 7500 చొప్పున మెుత్తం రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలానే రైతు కూలీలకు రూ. 12 వేల ఆర్థిక సాయంపైనా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరి కొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Show comments