iDreamPost
android-app
ios-app

రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. నెలాఖరు నుంచే రైతు భరోసా..

  • Published Nov 04, 2024 | 11:51 AM Updated Updated Nov 04, 2024 | 11:51 AM

CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ సర్కార్ రైతులకు గొప్ప శుభవార్త చెప్పింది.

CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ సర్కార్ రైతులకు గొప్ప శుభవార్త చెప్పింది.

  • Published Nov 04, 2024 | 11:51 AMUpdated Nov 04, 2024 | 11:51 AM
రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. నెలాఖరు నుంచే రైతు భరోసా..

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ది ప్రాజెక్టులను జనంలోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రతిపక్షాల ముకుతాడు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. మహాలక్ష్మి, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో జనంలోకి దూసుకువెళ్తున్నారు. అంతేకాదు మహిళా సాధికారత, రైతాంగం, ఉద్యోగ కల్పన, విద్యా ప్రమాణాలను మరింత పెంచడానికి ప్రధాన్యత ఇస్తున్నారు తెలంగాణ సర్కార్. తాజాగా రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. పూర్తి వివరాల్లోకి వెళితే..

రైతు భరోసా నగదును ఈ నెలాఖరున అకౌంట్లోకి జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిధులు లేకపోవడం వల్ల రైతు భరోసా ఆలస్యం అయినట్లు సమాచారం. వాస్తవానికి దసరా తర్వాత నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కాకపోతే అప్పటికే రుణమాఫీ కోసం రూ.18 వేల కోట్లు రైతులకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో పాటు కొన్ని స్కీములకు నిధులు సర్ధుబాటు చేయాల్సి రావడం వల్ల ఆలస్యం అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిధులను సర్ధుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది. రైతుల విషయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వబోమని ఆయన గట్టిపట్టుమీద ఉన్నారు. డిసెంబర్ లోగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమచేయాలని చూస్తున్నారు. పది రోజులకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల చొప్పున జమ చేసేలా 45 రోజులు కనీసం రూ.7 వేల కోట్లు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం.. ఏడెనిమిది ఎకరాల రైతులకు దాదాపు 96 శాతం మందికి రైతు భరోసా అందుతుందని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో అనవసరమైన రాళ్లు, రప్పలు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు కు రైతు భరోసా ఇవ్వడం వల్ల ఎంతో నష్టం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై జిల్లాలో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది. చాలా మంది రైతులకు పది ఏకరాల వరకు పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందని అబిప్రాకం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఏడున్నర ఎకరాలకు ఇవ్వాలని సూచించారు. అయితే రైతు భరోసా పథకం కింద పది ఎకరాలు ఉన్నవారికా? ఏడున్నర ఎకరాలకు ఉన్నవారికా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే గైడ్ లైన్స్ పై కేబినేట్ సబ్ కమిటీ డ్రాఫ్ట్ నోట్ సిద్దం చేసింది. ఈ మార్గదర్శకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం. దీనిపై అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల కన్నా ముందే నిధులు రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలన్నారు.