iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంట‌ర్ బోర్డు కీలక నిర్ణయం

  • Published May 02, 2024 | 10:00 PM Updated Updated May 02, 2024 | 10:00 PM

మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంట‌ర్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణలో గత నెల 24న ఇంటర్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డ్ మార్కులతో చరిత్ర సృష్టించారు. ఫస్టియర్‌లో 2,87,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత 60.01 శాతంగా నమోదయ్యింది. సెకండియర్‌లో 3,22,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 64.19శాతంగా వెల్లడించారు. ఇక ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.

ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ అందించింది. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు తేదీని ప్ర‌భుత్వం పొడిగించింది. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు ఉత్త‌ర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వ‌ర‌కు ఫెయిలైన విద్యార్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన రోజు జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. అయితే పలువురు విద్యార్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వ‌ర‌కు పొడిగించారు.

ఇంటర్ మొదటి సంవత్సరం టైమ్ టేబుల్:

  • సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1 : మే 24
  • ఇంగ్లీష్ పేపర్ 1 : మే 25
  • మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ – 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 : మే 28
  • మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 : మే 29
  • ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 : మే 30
  • కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 : మే 31
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్1 : జూన్ 1
  • మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫి పేపన్ 1 : జూన్ 3

ఇంటర్ ద్వితీయ సంవత్సరం టైమ్ టేబుల్:

  • సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 : మే 24
  • ఇంగ్లీష్ పేపర్ 2 : మే 25
  • మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ – 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 : మే 28
  • మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 : మే 29
  • ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్2 : మే 30
  • కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్ 2 : మే 31
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 : జూన్ 1
  • మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫి పేపన్ 21 : జూన్ 3