స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచంటే

Sankranti Holidays: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి హాలీడేస్ గురించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు..

Sankranti Holidays: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి హాలీడేస్ గురించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు..

కొత్త ఏడాది ప్రారంభమయ్యింది. ఇక పిల్లలు, పెద్దలు అందరూ ఆత్రుతగా ఎదురు చూసేది సంక్రాంతి పండుగ కోసం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగగా గుర్తింపు తెచ్చుకున్న సంక్రాంతి పండుగ జనవరి నెలలోనే వస్తుంది. ఇక కన్న వారికి, సొంత ఊరికి దూరంగా ఉన్న వారంతా సంక్రాంతి పండుగ కోసం కచ్చితంగా సొంత ఊళ్లకు వెళ్తారు. ఇక విద్యార్థులు కూడా సంక్రాంతి సెలవుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పండుగ కోసం వరుసగా 6 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ ఈ సెలవులు డిక్లేర్ చేసింది. జనవరి 12 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవుల్లో.. రెండో శనివారం సెలవు కూడా కలిసిపోయింది. జనవరి 13న 2వ శనివారం కాగా.. 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలతో పాటు అదనంగా జనవరి 17న సెలవు ఉంది.

అయితే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. ఇంటర్, డిగ్రీ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి అన్నది ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి హాలీడేస్ తో పాటు.. జనవరి 7, 14, 21, 28 ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి. 26న రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు ఉంటుంది. మెుత్తానికి జనవరి నెలలో దాదాపు సగం రోజులు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా సూళ్లకు సెలవుల విషయమై క్లారిటీ ఇవ్వటంతో ఫెస్టివల్ కి సొంతూళ్లకు వెళ్లేవాళ్లు సిద్ధమవుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లలో రద్దీ పెరగనుంది. పైగా మహిళలకు ఉచిత ప్రయాణం ఆఫర్ ఉండటంతో ఈ సారి బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.

Show comments