P Venkatesh
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 8న సెలవు ప్రకటించింది. ప్రభుత్వం ఈ నెల 8న సెలవు ప్రకటించడానికి గల కారణం ఏంటంటే?
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 8న సెలవు ప్రకటించింది. ప్రభుత్వం ఈ నెల 8న సెలవు ప్రకటించడానికి గల కారణం ఏంటంటే?
P Venkatesh
కొత్త సంవత్సరం వేళ జనవరి నెలలో భారీగానే సెలవులొచ్చాయి. సంక్రాంతి పండగ, రిపబ్లిక్ డే, ఆదివారాలు, రెండో శనివారాలు కలుపుకుని సెలవులు భారీగానే వచ్చాయి. సెలవుల్లో పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూత పడడంతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సమయం దొరికినట్టైంది. ఇక ఫిబ్రవరి నెలలో సెలవులు తక్కువగా ఉండడంతో విద్యార్థులు, ఉద్యోగులు కొంత నిరాశకు లోనయ్యారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించిది. ఈ నెల 8న సెలవుగా ప్రకటించింది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 2024కు సంబంధించిన సెలవుల జాబితాలో ఫిబ్రవరిలో సాధారణ సెలవులేమీ లేవు. మరి ప్రభుత్వం సెలవు ఎందుకు ప్రకటించిందంటే?
అయితే ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో మాత్రం ఫిబ్రవరి 8న సెలవు లేదు. మరి ప్రభుత్వం ఆ రోజున సెలవు ఎందుకు ప్రకటించింది అంటే.. ఈ నెల 8న ముస్లింల పండగ రానుంది. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 8 ఐఛ్చిక సెలవు కింద ఉండగా దానిని సాధారణ సెలవుగా మార్చింది. ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవును ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛి క సెలవులను ఖరారు చేసిన విషయం తెలిసిందే.