P Krishna
P Krishna
దేశంలో తర్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. నేడు సాయంత్రం వరకు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు పూర్తి సిద్దమైనట్లు తెలుస్తుంది. అధికార, ప్రతిపక్ష నేతల ఇప్పటికే ప్రజల్లోకి తమ తమ వ్యూహాలతో వెళ్తు ప్రచారాలు మొదలు పెట్టారు. భారీ బహిరంగ సభల్లో తమ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ ఉద్యోగులు, పెన్షన్ దారులకు తీపి కబురు అందించింది. వివరాల్లోకి వెళితే..
నేడు సాయంత్రం వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షన్ దారులకు గొప్ప శుభవార్త అందించారు. ఉగ్యోగులు, పింఛనర్ల కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ హెల్త్ స్కీం ద్వారా ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనం పొందవచ్చు. కాగా, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ స్కీమ్ నిర్వహణకోసం ప్రభుత్వ హెల్త్ కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో అధికారులు, ఉద్యోగులు, పింఛనర్లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన జీవో నంబర్ 186 ను ప్రభుత్వం విడుదల చేసింది.
గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెంఛనర్లకు ఈ ప్రయోజనాన్ని అందించాలని మొదటి పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఉద్యోగులు, పెంఛనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీశ్ రావు తెలిపారు. నూతనంగా తీసుకువ చ్చిన ఈ విధానంతో ఉద్యోగస్తులు, పెంఛనర్లతో పాటు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యసేవలు పొందవొచ్చు అని ఆయన అన్నారు. ఈ పథకం అమలుకు ప్రత్యేక ట్రస్టు ద్వారా కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతినెల ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా జమ చేయాలని చెప్పింది. తమ మూల వేతనం లో ఒకశాతం కంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని గతంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సర్కార్ కి వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రి హరీశ్ రావు ఆరోగశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవోతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి మొత్తానికి ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుకు కృషి చేశారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు, పెంఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.