తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి ఇలా అప్లయ్ చేసుకోండి!

కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్ డేట్ ఇచ్చింది. వచ్చే నెలలో రేషన్ కార్టులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం మళ్లీ అప్లై చేసుకోవాలని కోరుతోంది. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే?

కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్ డేట్ ఇచ్చింది. వచ్చే నెలలో రేషన్ కార్టులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం మళ్లీ అప్లై చేసుకోవాలని కోరుతోంది. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే?

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోది. దీనిలో భాగంగానే కొత్త రేషన్ కార్డుల కోసం మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని రేవంత్ సర్కార్ కోరుతోంది. గతేడాది డిసెంబర్ లో ప్రజాపాలన కార్యక్రమం పేరుతో ఆరుగ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించనవే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దరఖాస్తులను స్క్రుటినీ చేయడం కాస్త ఇబ్బందిగా మారడంతో మీ సేవ కేంద్రాల ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డులు కీలకంగా మారడంతో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోది. దరఖాస్తుదారుల నుంచి ఇప్పుడు కొత్తగా అధికారికంగా మీ సేవా ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల స్వీకరణకు సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ కసరత్తులు చేస్తోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులతో సంబంధం లేకుండా మళ్లీ మీ సేవా కేంద్రాల్లో కొత్తగా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

కొత్త రేషన్ కార్డుల తో పాటు రేషన్ కార్డుల్లో పేరు లేని వారు కూడా మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతోంది. కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారు స్థానిక మీ సేవా కేంద్రాల్లో ఫిబ్రవరి చివరి వారంలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికంగా మారడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అప్లై చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందించేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతోంది. మరి తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments