తెలంగాణ ప్రజలకు CM రేవంత్ సర్కార్ అలర్ట్.. ఆ కార్డులకు దరఖాస్తు చేసుకోండి!

Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు వరుస గుడ్ న్యూస్‌లు చెబుతుంది. తెలంగాణ ప్రజలకు మరో అదిరిపోయే శుభవార్త అందించారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు వరుస గుడ్ న్యూస్‌లు చెబుతుంది. తెలంగాణ ప్రజలకు మరో అదిరిపోయే శుభవార్త అందించారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ 2023 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాల అమలుతో పాటు, 2 లక్షల ఉద్యోగల భర్తీ, పేదలకు ఇందిర్మ ఇళ్లు, విద్యా రుణాలు, వ్యవసాయ రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అర్హులకు కొత్త రేషన్ కార్డులు, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, పింఛన్ రూ.4 వేలకు పెంపు ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు అప్పటి టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి. కాంగ్రెస్ హామీలపై నమ్మకంతో అద్భుత విజయాన్ని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉంది. తాజాగా తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు వివిధ కార్డులు ఉన్నప్పటికీ.. వాటన్నింటిని ఒకే కార్డుగా మార్చినట్లయితే అన్ని సులభతరం అవుతుందని చాలా మంది అభిప్రాపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులను అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ కొత్త డిజిటల్ కార్డులు ప్రజల ఆరోగ్య సేవల అందుబాటును మరింత మెరుగుపరుస్తుందని అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ అర్హులైనవారికి డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ కార్డుల కోసం అక్టోబర్ మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త డిజిటల్ హెల్త్ కార్డుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే చేసి, కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించి, ప్రత్యేక వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ ను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు వీలు అవుతుందని, అవసరమైన చోట ప్రభుత్వ ఆస్పత్రులు, ఎన్‌జీవోల సహకారం తీసుకుంటామని అన్నారు.

ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు. వ్యక్తులకు సంబంధించి పూర్తి ఆరోగ్య వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా కార్డు స్కాన్ చేయగానే పూర్తి డిటేల్స్ అన్ని తెలుస్తాయి. ఆ వ్యక్తి గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. వాటికి ఎలాంటి చికిత్స అందిచారు అన్న వివరాలు తెలుస్తాయి. తెలంగాణలో చాలా మంది హెల్త్ చెకప్ చేయించుకోరు.. అలా చేయించుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని భావిస్తుంటారు. కానీ, ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ హెల్త్ కార్డులతో ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత వివరాలు నమోదు చేస్తారు. తద్వారా తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కలుగుతుంది. ప్రజలు తక్కువ వ్యయంతో వారి ఆరోగ్య వివరాలను నిరంతరం అప్ డేట్ చేసుకునే వీలు ఉంటుంది.

Show comments