iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్యారోగ్య శాఖలో 755 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. వైద్యారోగ్య శాఖలో పలు విభాగాల్లో 755 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలోనే నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. వైద్యారోగ్య శాఖలో పలు విభాగాల్లో 755 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలోనే నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్యారోగ్య శాఖలో 755 ఉద్యోగాలు

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై దృష్టిసారించింది. వివిధ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నది. ఇప్పటికే గ్రప్ 1,2,3 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. మరోవైపు మెగా డీఎస్సీ ద్వారా 11 వేల పైచిలుకు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ క్రమంలో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురును అందించింది. వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. వైద్యారోగ్య శాఖలోని పలు విభాగాల్లో 755 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్లను విడుదల చేయనున్నది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఖాళీల భ‌ర్తీపై దృష్టి సారించింది. పలు ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్ధమైంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులు 531 భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌ల నియామ‌క బోర్డు త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అదేవిధంగా 193 ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అలాగే, వివిధ ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ‌లు అందించే స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు 31 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్‌బీ నోటిఫికేష‌న్ జారీ చేయనున్నది. త్వరలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్న నేపథ్యంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.