P Venkatesh
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే రైతు భరోసాకు వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి ఆర్థిక సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే రైతు భరోసాకు వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి ఆర్థిక సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
P Venkatesh
రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేవారు. వానాకాలం, యాసంగి పంటలకు ఏడాదికి రెండు సార్లు ఎకరానికి ఐదు వేల చొప్పున రైతు బంధు నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది ప్రభుత్వం. కాగా తెలంగాణలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ఎవరికి వర్తింపజేయాలి? ఎన్ని ఎకరాల్లోపు అందిస్తే సమన్యాయం జరుగుతుందనే విషయంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో రైతు బంధు పథకం పట్ల కొంత వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. 50 ఎకరాలకు పైబడిన భూస్వాములకు, పడావు భూములకు సైతం రైతు బంధు ఇస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఏ విధమైన మార్పులు చేయకుండా గతంలో ఇచ్చిన మాదిరిగానే రైతు బంధు అందజేస్తుంది తెలంగాణ సర్కార్. కానీ వచ్చే ఏడాది వానాకాలం పంటలకు 10 ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పది ఎకరాలకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే విధంగా ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి రూ. 7500 చొప్పున సంవత్సరానికి రూ.15000 రైతులకు అందించనుంది.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఉన్నవారు 90 శాతం మంది రైతులు, ఎకరం లోపు రైతులు 22.5 లక్షల మంది ఉన్నారు. కాగా పది ఎకరాలనుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.5 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే పది ఎకరాల పరిమితి పెడితే రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందనుంది. మరి రైతు బంధు పథకంలో మార్పులు చేయబోతున్న ప్రభుత్వ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.