P Krishna
Good News for Farmers: తెలంగాణలో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్.
Good News for Farmers: తెలంగాణలో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపైనే చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే..
రైతులకు శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొంతమంది రైతన్నలు పంట నష్టాన్ని చూశారు. ముఖ్యంగా మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రైతులకు జరిగిన నష్టంపై స్పందించిన రేవంత్ రెడ్డి సర్కార్ బాధిత రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇటీవల ప్రతిపక్ష నేతల కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పంటలపై పరిశీలన చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు. బాధిత ప్రాంతాలను సందర్శించిన మంతులు లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎకరాకు పది వేల చొప్పున జమచేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
15వేల 814 ఎకరాలలో 15,266 మంది రైతులు పంట నష్టపోయారని తెలంగాణ సర్కార్ అంచనా వేసింది. ఇప్పటికే 15.81 కోట్ల పరిహారం అందించగా.. లోక్ సభ ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ అనుమతితో రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేయడం జరుగుతుందని అంటున్నారు. ఈసీ పరిమిషన్ ఇస్తే వెంటనే అకౌంట్లో పదివేలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణాలలో రెండు లక్షల వరకు రుణమాఫీ.. అలాగే వరికి 500 బోనస్ వచ్చే సిజన్ లో అమలు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడు రైతు పక్షం ఉంటుందని.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.