ప్రభుత్వ టీచర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై అది తప్పనిసరి!

Telangana Government Teachers: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం కొన్ని నియమనిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Telangana Government Teachers: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం కొన్ని నియమనిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు విషయంలో ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. టెట్ దరఖాస్తుల స్వీకరణం బుధవారం నుంచి మొదలవుతున్న నేపథ్యంలో టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు సిద్దమవుతున్నారు. ఇకపై ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలని నిన్నమొన్నటి వరకు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.    అయితే పరీక్ష కు విద్యాశాఖ నుంచి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలా? లేదా? అన్న అయోమయానికి గురయ్యారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈ విషయంపై విద్యాశాఖ కమీషన్ పూర్తి క్లారిటీ ఇచ్చింది.   వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టీచర్లకు అలర్ల్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. అయితే ఈ విషయంలో ఉపాధ్యాయులకు పలు సందేహాలు ఉన్నాయి.  టెట్ ఎగ్జామ్ విషయంలో ఉపాధ్యాయులకు పలు సందేహాలకు గురి అవుతున్నారు.   రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లు టెట్ ఎగ్జామ్ రాయడానికి ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.  టీచర్ల పదోన్నతులు కల్పించేందుకు టెట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటి) నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం గా పదోన్నతి పొందాలనుకునే వారు తప్పని సరిగా అయ్యింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ టీచర్లు సైతం పదోన్నతులు పొందేందుకు టెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఇవ్వగా.. దీన్ని సవరించి ప్రభుత్వ టెట్ జీవోల్లో మార్పులు చేసింది. బుధవారం టెట్ ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణం మొదలైంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోచ్చు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు ఆన్ లైన్ లో జరుగుతాయి.

Show comments