P Krishna
A School for One Student: సాధారణంగా ప్రభుత్వ పాఠశాల అనగానే తల్లిదండ్రులకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది.. అక్కడ సరైన వసతులు, విద్యా బోధన ఉండదు, పరీక్షలో రిజల్ట్ బాగా రాదు అని భావిస్తుంటారు.
A School for One Student: సాధారణంగా ప్రభుత్వ పాఠశాల అనగానే తల్లిదండ్రులకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది.. అక్కడ సరైన వసతులు, విద్యా బోధన ఉండదు, పరీక్షలో రిజల్ట్ బాగా రాదు అని భావిస్తుంటారు.
P Krishna
గత కొంత కాలంగా సర్కార్ విద్యావ్యవస్థలో ఉన్న లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండకపోవడం.. ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులు లేకపోవడంతో భోదన, అభ్యసన ప్రక్రియకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సర్కార్ బడుల్లో విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. అలాంటిది ఓ విద్యార్థి కోసం స్కూల్ నడిపిస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ ఈ స్కూల్ ఎక్కడో తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా దత్తాయిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఓ వింత పరిస్థితి కొనసాగుతుంది. ఆ ఊరిలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు. వింటానికి కాస్త వింతగా ఉన్నా.. ఇది పచ్చి నిజం. దత్తాయిపల్లి తండాలో దాదాపు 80 ఇళ్లు.. 300 వరకు జనాభా ఉన్నారు. గ్రామ జనాభాలో 60 శాతానికి పైగా ఉపాధి కోసం ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్లారు. తల్లిదండ్రుల వెంట వారి పిల్లలను కూడా వలస బాట పట్టించారు. దీంతో తండాలో పాఠశాలలో విద్యార్థులు కరువయ్యారు.. ఏంతగా స్కూల్ మొత్తానికి ఒకే ఒక్క విద్యార్థిని మిగిలింది. ఆ విద్యార్థిని పేరు నిహారిక.. ఒకటో తరగతి చదువుతుంది.
స్కూల్ మొత్తానికి ఉన్న ఒక్క విద్యార్థినికి చదువు చెప్పడానికి జయవర్థన్ రెడ్డి అనే టీచర్ ప్రతిరోజూ వనపర్తి వచ్చి వెళ్తున్నారు. ఆయన సెలవు పెడితే ఆ రోజు స్కూల్ మూతపడినట్లే లెక్క. అత్యవసర పరిస్థితుల్లో జయవర్థన్ రాని రోజున పాఠశాల సమీపంలో ఉన్న అంగన్ వాడీ కేంద్రంలో నిహారికకు అక్కడ టీచర్ విద్యాబోధన, పర్యవేక్షణ చూసుకుంటుంది. అయితే కరోనాకు ముందు ఈ స్కూల్ లో 30 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు.. క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ 2022నాటికి ఒక విద్యార్థిని మాత్రమే మిగిలినట్లు సమాచారం. ఆ ఊరికి వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి వస్తే తండా పాఠశాలలో మళ్లీ పిల్లలతో పునఃవైభవం సంతరించుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, తండాలో ఉన్న స్కూల్ కి ఒకే విద్యార్థిని కోసం విద్యాబోధన చేయడానికి మాస్టారు వెళ్లడం, ఆ స్కూల్ ని నడిపించడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు ఈ విషయం తెలిసిన ప్రజలు. తెలంగాణగా సర్కార్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు.