Telangana New Ration cards: కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే!

కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే!

Telangana New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూ రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

Telangana New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూ రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అర్హులైన వారందరికీ న్యూ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే కొత్త రేషన్ కార్డులకు అర్హత పొందాలంటే లబ్ధిదారులకు ఈ అర్హతలుండాల్సిందే. లేదంటే రేషన్ కార్డులను పొందలేరు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏయే అర్హతలు ఉండాలంటే?

కొత్త రేషన్ కార్డులు వీరికి మాత్రమే?

కొత్త రేషన్ కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ. లక్షన్నర,మాగాణి, 3.50 ఎకరాలు, చెలక, 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రూ. 2 లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రతిపాదించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనున్నది.

Show comments