iDreamPost
android-app
ios-app

హైడ్రా విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన వ్యూహం!

  • Published Sep 15, 2024 | 3:54 PM Updated Updated Sep 15, 2024 | 3:54 PM

Telangana Government: చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తుంది హైడ్రా.

Telangana Government: చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తుంది హైడ్రా.

హైడ్రా విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన వ్యూహం!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా పేరు మారుమోగుతుంది. హైదరాబాద్ పూరిసరాల్లో ఉన్న ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నగరం వ్యాప్తంగా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. రెండు నెలలుగా చెరువల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణల పనిపడుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్దంగా ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. తాజాగా హైడ్రా విషయంలో రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో రెండు నెలలుగా ఏ మీడియా ఛానల్ లో చూసినా హైడ్రా పేరే వినిపిస్తుంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు, పార్కులు, కుంటల పరిరక్షణ కోసం తీసుకువచ్చిన వ్యవస్థనే ‘హైడ్రా’. ప్రస్తుతం హైడ్రా పేరు రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. హైడ్రా పేరు చెబితే అక్రమంగా కబ్జా చేసి నిర్మాణలు చేపట్టిన వారి వెన్నుల్లో వణుకు పుడుతుంది. హైడ్రా లాంటి వ్యవస్థ ప్రతీ చోట రావాలన్న చర్చ జరుగుతుంది. అన్ని జిల్లాల్లో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉంటే.. హైడ్రా పనితీరు పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు, వ్యతిరేకతలు వస్తున్నాయి. అంతేకాదు హైడ్రా చట్టబద్దతపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు హైకోర్టులో కేసు కూడా నమోదైంది. హైడ్రాను మరింత బలోపేతం చేస్తున్న వేళ.. ఇలాంటి చర్చ జరగడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్ లో హైడ్రాకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చట్టబద్దత చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకురావడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.

ఈ నెల 20 న జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో ఈ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతేకాదు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశ పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే భవిష్యత్ లో ఎవరూ హైడ్రాను టచ్ చేయలేరు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.