Arjun Suravaram
Telangana Budget 2024-25:తెలంగాణ బడ్జెట్ 2024-24ను రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో మహిళలకు వరాల జల్లు కురిపించారు.
Telangana Budget 2024-25:తెలంగాణ బడ్జెట్ 2024-24ను రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో మహిళలకు వరాల జల్లు కురిపించారు.
Arjun Suravaram
గురువారం తెలంగాణ బడ్జెట్ 2024-24ను రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఇక ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాడు. గురువారం ఉదయం రేవంత్ రెడ్డి మంత్రి మండలి ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తంగా రూ.2,91,159 కోట్లను రాష్ట్రాభివృద్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు పాలనా పరమైన అంశాలకోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే.. రైతులకు రుణమాఫీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పినట్లు గానే..తాజాగా మహిళలకు కూడా శుభవార్త చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గురువారం తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విషయాలను ప్రకటించారు. మహిళా సాధికారత కోసం పెద్ద పీట వేస్తూ భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. 63 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ‘ఇందిరా మహిళా శక్తి’ స్కీమ్ ను రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం కింద మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇందిస్తామని, తద్వార వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.
ఇక ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. అదే విధంగా వారి కోసం ప్రత్యేక చిన్నతరహా ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ఏటా 5వేల గ్రామీణ సంఘాలు లేదా ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా రుణభీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద ఉన్న సభ్యులు ఎవరైనా చనిపోతే ఆమె పేరిట ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇలా గరిష్టంగా రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసి ఆ మహిళ కుటుంబానికి భరోసాగా ఉంటామని తెలిపారు.
ఇలా మహిళల రుణమాఫీ కోసం రూ.50.41 కోట్ల నిధులను బడ్జెట్ 2024-25 లో కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇక తెలంగాణ బడ్జెట్ విషయానికి వస్తే..మొత్తం బడ్జెట్ 2,91,159 లక్షల కోట్లు. అందులో రెవెన్యూ ఖర్చు రూ.2,20,945 కోట్లు, మూల ధన వ్యయం రూ.33,487 కోట్ల రూపాలయ ప్రతిపాదించారు.. ఈ బడ్జెట్ లో తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద పీట వేసింది. బడ్జెట్ లో మొత్తం రూ.72,659 కోట్లను వ్యవసాయానికే కేటాయించింది. అలాగే గ్యాస్ సబ్సిడీ పథకానికి 723 కోట్లు కేటాయించింది. గృహ జ్యోతి పథకానికి 2 వేల 418 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది కి రూ.29 వేల 816 కోట్లు కేటాయించింది. మరి..మహిళ రుణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.