10th పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త విధానంలో పరీక్షలు

10th class Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త విధానంలో పరీక్షలను నిర్వహించనున్నది. మార్కుల విధానంలో మార్పులు చేసింది.

10th class Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త విధానంలో పరీక్షలను నిర్వహించనున్నది. మార్కుల విధానంలో మార్పులు చేసింది.

పదో తరగతి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. టెన్త్ లో ప్రతిభ కనబరిస్తే ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు టెన్త్ లో మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేస్తుంటారు. టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తుంటారు. టెన్త్ లో సాధించే మార్కులు వివిధ కోర్సులు, పై చదువులు చదివేందుకు దోహదపడుతుంటాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రేవంత్ సర్కార్ ఎస్ ఎస్ సీ మార్కుల విధానంలో మార్పులు చేసింది.

టెన్త్ లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది పాఠశాల విద్యాశాఖ. ఇప్పటి వరకు టెన్త్ లో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు 20 మార్కులను వారి ప్రతిభ ఆధారంగా టీచర్లు వేసేవారు. అయితే ఈ ఇంటర్నల్ మార్కుల కారణంగా కొంత మంది విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటర్నల్‌ మార్కుల కేటాయింపులో పారదర్శకత కొరవడిందని ఆరోపణలు వచ్చాయి. కొందరు టీచర్లు ఉద్దేశ్యపూర్వకంగా కొందరు విద్యార్థులకు ఎక్కువ మార్కులు, మరికొందరికి తక్కువ మార్కులు వేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేసింది.

ఇకపై 100 మార్కులకు టెన్త్ ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే విద్యార్థులకు ఐదు పరీక్షలకు 24 పేజీల బుక్‌లెట్‌(ఆన్షర్‌షీట్‌)ను ఇవ్వాలని నిర్ణయించింది. సైన్స్‌ సబ్జెక్ట్‌కు మాత్రం ఫిజికల్‌ సైన్స్‌కు 12 పేజీలు, బయాలజికల్‌ సైన్స్‌కు 12 పేజీల చొప్పున బుక్‌లెట్లను అందజేయనున్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేయడం వల్ల టెన్త్ విద్యార్థులకు లాభం చేకూరనుంది.

టీచర్లు ఇంటర్నల్ మార్కులు వేయలేదనే చింత ఉండదు. పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిస్తే మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్‌ మార్కుల తొలగింపు విద్యార్థుల ఉన్నతికి మేలు చేస్తుంది. ఉపాధ్యాయులకు కూడా భారం తగ్గుతుంది. బోధనపై దృష్టి పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఇంటర్‌ ఫస్టియర్‌లో సీట్లు కేటాయిస్తారు. మరి టెన్త్ లో కొత్త విధానంలో పరీక్షలు నిర్వహించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments