Arjun Suravaram
తెలంగాణలో నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే సమయంలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. తాజాగా ఆ పంటలు వేసే రైతుల విషయంలో తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణలో నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే సమయంలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. తాజాగా ఆ పంటలు వేసే రైతుల విషయంలో తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
తెలంగాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే మహలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితం వంటివి అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో రైతులకు కూడ రేవంత్ సర్కార్ శుభవార్త చెబుతుంది. తాజాగా ఆయిల్ ఫామ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలో నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీల్లో ఎక్కువ శాతం హామీలు నెరవేర్చి ప్రజల్లో నమ్మకం చూరగొన్నది. ఇక ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ మాత్రం ఇంకా అమలు కాలేదు. పైగా ఈ ఏడాది సరైన వర్షాలు లేక.. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో రుణమాఫీకి ఆగస్టులో ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ గుడ్ న్యూస్ తో పాటు ఆయిల్ ఫామ్ రైతులకు కూడా ఓ శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఆయిల్ ఫాం, కొబ్బరి, కోకో,మామిడి పంటల ప్రాసెసింగ్ యూనిట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ ఫామ్ కంపెనీల ప్లాంటేషన్ వేగవంతం చేసి, వచ్చే సంవత్సరం పెద్దమొత్తంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫుడ్ పార్కులలో మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. మార్కెట్ యార్డులలో ఈ వేసవిలో రైతులకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచనలు చేశారు. మరి.. ఆయిల్ ఫామ్ రైతుల విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.