P Krishna
Telangana Government: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.
Telangana Government: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.
P Krishna
గత ఏడాది తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెపార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చింది. ఈ పథకాలు తెలంగాణ ప్రజలకు నచ్చడంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. అలాగే 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు.త్వరలో అర్హులైన ప్రతి మహిళకు రూ. 2500 మహాలక్ష్మి పథకం ద్వారా అందజేయబోతున్నట్లు తెలిపారు. తాజాగా తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణల ఇల్లు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆ ఆదేశాలను ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయనుందట. తొంలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్దిదారులకు రూ.5 లక్షలను మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమచేయనుంది. అర్హులై లబ్దిదారులను మాత్రమే ఎంపిక చేసి వారికి సొంత ఇంటి కల నెరవెర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది తెలంగాణ సర్కార్.
ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఏడాదికి 4.50 లక్షల ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని హౌసింగ్ కార్పోరేషన్, జిల్లా కలెక్టర్ లు, మున్సిపల్ కమీషనర్ లు పర్యవేక్షిస్తారని పొంగులేటి తెలిపారు. తెలంగాణాలో ప్రతి నిరుపేద సొంత ఇంటి కల నెరవేర్చి ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇళ్లు లేని వారు ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు.