తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!..ఈనెల 7, 17న సెలవు!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెలలో రెండు వేరు వేరు రోజుల్లో సెలవులను ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెలలో రెండు వేరు వేరు రోజుల్లో సెలవులను ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో సెలవులు ప్రకటిస్తుంటాయి. ఇదే సమయంలో విద్యార్థులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాల నుంచి వచ్చే ఇలాంటి సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. అంతేకాక బ్యాంకింగ్ రంగాలకు చెందిన వారు కూడా తమ సంస్థల నుంచి వచ్చే హాలీడే సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో రెండు వేరు వేరు తేదీల్లో హాలీడేను ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

2024 సెప్టెంబర్ 7, 17వ తేదీలను హాలీ డే గా ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వూలు జారీ చేసింది. మిలాద్ ఉన్ నబీ, వినాయక చవితి పండుగల నేపథ్యంలో ఆ రెండు రోజులు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితికి, అలానే సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీకి హాలీడే ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ సాధారణ సెలవుల క్యాలెండర్ చూస్తే 7వ తేదీ గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవుగా డిక్లేర్ చేశారు.

తాజాగా నెలవంక కనిపించే దాని బట్టి మిలాద్ ఉన్ నబీ హాలీడే లో మార్పులు జరిగాయి. తొలుత నిర్ణయించిన 16వ తేదీన కాకుండా..ఆ మరుసటి రోజు 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ పండగ సెలవుగా ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన గణేష్ వినాయక చవిత నవరాత్రులు ప్రారంభం కానుండగా.. 17న నిమజ్జనం జరగనుంది. 17న వినాయక నిమజ్జనం జరగనుండటంతో అదే తేదీన జరగాల్సిన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఆ రోజుకు బదులుగా 19వ తేదీన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇటీవల వరదల కారణంగా తెలంగాణలోని  పలు ప్రాంతాల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసింది. నేడు కూడా పలు జిల్లాలో విద్యాసంస్థలకు హాలీడేను ప్రకటిస్తూ.. జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. గతకొన్ని రోజులుగా కుండపోతగా వానలు కురవడంతో అన్ని ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. ఇక విద్యార్థుల భద్రత దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం హాలిడేను ప్రకటించింది.  సోమ, మంగళవారం రాష్ట్రంలోని  అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..నేడు మాత్రం కొన్ని జిల్లాల్లో మాత్రమే, అదికూడా వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలకు మాత్రమే సెలవులను ప్రకటించారు. మొత్తంగా సెప్టెంబర్ 7,  17 న సెలవులు ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments