iDreamPost
android-app
ios-app

రైతులకు గుడ్‌న్యూస్.. వడ్లకు 500 బోనస్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి గుడ్ న్యూస్ అందించింది. వడ్లకు రూ. 500 బోనస్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచే రైతులకు 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి గుడ్ న్యూస్ అందించింది. వడ్లకు రూ. 500 బోనస్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచే రైతులకు 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది.

రైతులకు గుడ్‌న్యూస్.. వడ్లకు 500 బోనస్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులను విడుదల చేసిన సర్కార్ తాజాగా మరో గుడ్ న్యూస్ అందించింది. వడ్లకు రూ. 500 బోనస్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు జరిగిన కేబినెట్ మీటింగ్ లో రైతులకు అప్పటి నుంచే రూ. 500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ కేబినెట్ భేటీ ఈరోజు (మే 20న) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలకు తడిచిన ధాన్యానికి మద్దతు ధర, వడ్లకు రూ. 500 బోనస్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అధనపు కలెక్టర్లు, అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు.

CM Revanth reddy

తాము అధికారంలోకి వస్తే రైతులకు వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన కేబినెట్ లో ధాన్యంపై రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. అయితే ఈ బోనస్ సన్న వడ్లకు మాత్రమే ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు మద్దతు ధరపై క్వింటాల్ కు రూ. 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రైతులు పండించే సన్న బియ్యాన్నే కొనుగోలు చేసి సరఫరా చేయనున్నట్లు తెలిపారు.