iDreamPost
android-app
ios-app

ఇమామ్, మౌజంలకు గుడ్ న్యూస్! మరో 7 వేల మందికి గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం..

  • Author Soma Sekhar Published - 04:00 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Published - 04:00 PM, Tue - 8 August 23
ఇమామ్, మౌజంలకు గుడ్ న్యూస్! మరో 7 వేల మందికి గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఇక ఇప్పటికే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. సబ్బండ వర్గాల అభిమానాన్ని చురగొంటోంది. ఇప్పటికే గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ, గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ, రైతు బంధు, రుణ మాఫీ, ఆసరా పెన్షన్స్ లాంటి పథకాలను తెలంగాణన ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో 7005 మంది ఇమామ్ లు, మౌజం లకు గౌరవ వేతనం ఇచ్చేందుకు ఉత్తర్వులను జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ లాంటి ప్రకటన చేసిన కేసీఆర్ సర్కార్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో మరో 7005 మంది ఇమామ్ లు, మౌజంలకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో గౌరవ వేతనం అందుకునే ఇమామ్, మౌజంల సంఖ్య 17 వేలకు చేరుకుంది. కాగా.. ఇమామ్ లు, మౌజంల లబ్దిదారుల సంఖ్యను పెంచాలని ఇటీవల జరిగిన శాసనసభ పక్ష సమావేశాల్లో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఓవైసీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు సీఎం కేసీఆర్. కాగా.. ఈ పథకం కింద మెుదట్లో మసీదుల్లోని ఇమామ్, మౌజంలకు నెలకు రూ. 1000 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా.. ఆ తర్వాత ఈ వేతనాన్ని వరుసగా రూ. 1500కు, ఆపై రూ. 5వేలకు పెంచింది తెలంగాణ సర్కార్. దీంతో రాష్ట్రంలోని 17 వేల మంది ఇమామ్, మౌజంలకు లబ్దిచేకూరనుంది.

ఇదికూడా చదవండి: వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు రూ.3 వేలు నేరుగా అకౌంట్లలోకి: KTR