Arjun Suravaram
Telangana Jobs: ఎంతో మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉంటుంది. దానిని సాకారం చేసుకునేందుకు కూడా గట్టిగా కృషి చేస్తుంటారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు.
Telangana Jobs: ఎంతో మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉంటుంది. దానిని సాకారం చేసుకునేందుకు కూడా గట్టిగా కృషి చేస్తుంటారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు.
Arjun Suravaram
చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉంటుంది. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ కోచింగ్స్ తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటారు. అలా ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన కూడా ఫలితాల విడుదల, నియామక పత్రాలు అందించే విషయంలో చాలా జాప్యం జరుగుతుంటుంది. దీంతో నిరుద్యోగులు వెయ్యికళ్లతో ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజూ నుంచి నిరుద్యోగల విషయంలో సానుకూలంగా ఉన్నారు. అంతేకాక వారికి సంబంధించిన ఉద్యోగాల విషయాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే గ్రూప్-1 పోస్టులను పెంచుతూ ఉత్తర్వూలను ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 17,840 మందికి కొలువురు ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ కీలక ముందడుగు వేశారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి 15,750 మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందిస్తారు. కానిస్టేబుల్ పరీక్ష, ఇతర ప్రక్రియలు పూర్తైన అభ్యర్థుల నియామకాలకు హైకోర్టు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అభ్యర్థులకు నియామకాల పత్రాలను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
అదే విధంగా బుధవారం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ గురుకుల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, డిగ్రీ కళాశాలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇలా గురుకులాలకు సంబంధించిన కొలువుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. గురుకుల కొలువులకు సంబంధించి 2,090 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ట్రైబ్) ఈ నియామకాల ప్రక్రియను చూస్తోంది. నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తారని సమాచారం. ఒకవేళ ఇవాళ కుదరకపోతే, గురువారం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా నిరుద్యోగుల విషయంలో ఇలా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వచ్చింది అంటున్న కాంగ్రెస్ సర్కారు.. త్వరలోనే మరిన్ని పోస్టుల భర్తీ కూడా జరుగుతుందని చెబుతోంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలో 2023 సంవత్సరంలో 9,210 పోస్టుల భర్తీకి ఎగ్జామ్స్ జరిగాయి. వాటి భర్తీ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమవుతోంది. త్వరలో మరో 7వేల పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. మొత్తంగా నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ లను చెబుతూ ఉంది. మరి.. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.