Telangana Govt Focus On Nelakondapally: తెలంగాణలో మరో టూరిజం హబ్.. మారిపోనున్న ఆ ఏరియా రూపురేఖలు!

తెలంగాణలో మరో టూరిజం హబ్.. మారిపోనున్న ఆ ఏరియా రూపురేఖలు!

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంపై సర్కారు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే డెవలప్​మెంట్​కు దూరంగా ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్​ మీద ఫోకస్ పెట్టింది.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంపై సర్కారు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే డెవలప్​మెంట్​కు దూరంగా ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్​ మీద ఫోకస్ పెట్టింది.

తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంపై సర్కారు దృష్టి పెట్టింది. డెవలప్​మెంట్​కు దూరంగా ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్​పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిని టూరిజం హబ్​గా మార్చాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరం, బౌద్ధ మహాస్థూపాలను ఆయన సందర్శించారు. భట్టితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు కూడా సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచ పటంలో ఉంచాలని, బౌద్ధ క్షేత్రాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అనుకుంటున్నామని భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసం ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. బుద్ధిస్టులను తీసుకొచ్చి, వాళ్ల సూచనల మేరకు డెవలప్​మెంట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ బౌద్ధ స్థూపం సౌతిండియాలోనే అత్యంత పెద్దదని చెప్పుకొచ్చారు. ఈ బౌద్ధ స్థూపాన్ని ఆర్కియాలజీకల్ సైట్​గా చేయాలని అధికారులను భట్టి ఆదేశించారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యాటక, ఆర్కియాలజీ శాఖల అధికారులు సమన్వయంతో కలసి పని చేయాలన్నారు.

నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని దేశంలోనే ది బెస్ట్​గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక్కడ బుద్ధిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇక్కడి డెవలప్​మెంట్​కు సంబంధించి కావాల్సిన నిధులను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. డీపీఆర్​ రెడీ చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించిన భట్టి.. రూ.10 కోట్ల కేటాయింపులతో పనులు మొదలుపెట్టాలని సూచించారు. ఈ ప్రాంతానికి మరో స్పెషాలిటీ కూడా ఉందని.. భక్తరామదాసు పుట్టింది ఇక్కడేనన్నారు. భక్తరామదాసు జన్మస్థలం, బౌద్ధ స్థూపం, పాలేరు రిజర్వాయర్.. ఈ మూడింటిని డెవలప్ చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించొచ్చని సూచించారు భట్టి. ఇక, టూరిజం హబ్​గా అభివృద్ధి చేస్తే నేలకొండపల్లి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని.. ఈ ఏరియాకు డిమాండ్ అమాంతం పెరుగుతుందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

Show comments