P Venkatesh
Oilpalm bunches price: రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. దసరా కానుకగా అదిరిపోయే గిఫ్టును అందించింది. వారికి దాదాపు రూ. 3 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
Oilpalm bunches price: రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. దసరా కానుకగా అదిరిపోయే గిఫ్టును అందించింది. వారికి దాదాపు రూ. 3 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
P Venkatesh
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేస్తుంది. రైతులకు అండగా నిలిచేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నది. కర్షకులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన వరిధాన్యానికి రూ.500 బోనస్ అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 15 వేలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు రుణమాఫీని కూడా అమలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసింది.
ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మరో తీపికబురును అందించింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు దసరా కానుకగా సీఎం రేవంత్ అదిరిపోయే గిఫ్ట్ ను అందించారు. పామాయిల్ రైతులకు మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రూ. 3 వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో పామాయిల్ రైతుల కుటుంబాల్లో దసరా పండగ సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. పామాయిల్ గెలల ధరను రూ.17,043కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు.
కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచిందని వెల్లడించారు. సెప్టెంబరు 13న ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని తుమ్మల వెల్లడించారు. గెలల ధర పెరుగుదలతో పామాయిల్ సాగువైపు మరికొందరు రైతులు మొగ్గుచూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృషి వల్లనే ఇది సాధ్యమైందన్నారు. దీంతో ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు రూ.14,392 నుంచి రూ.17,043కి పెరిగిందని చెప్పారు. అంటే దాదాపు రూ. 3 వేలు అదనంగా రైతులకు అందనున్నాయి. పామాయిల్ సాగు చేసే వేలాది మంది రైతన్నలకు లబ్ధి చేకూరనున్నది.