ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. ఆ రోజు వేతనంతో కూడిన సెలవు

ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రోజు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రోజు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ప్రైవేట్ సంస్థలే. లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇక ప్రైవేట్ కంపెనీల్లో సెలవు దొరకాలంటే కష్టమనే చెప్పాలి. ముఖ్యమైన పనులుంటే తప్పా సెలవు మంజూరు చేయదు ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాలు. ఒక వేళ సెలవు తీసుకుంటే ఆ రోజుకు జీతం కట్ చేస్తారు. మరి మీరు కూడా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా? అయితే తెలంగాణ ప్రభుత్వం మీకు ఓ గుడ్ న్యూస్ అందించింది. ఆ రోజు మీరు విధులకు హాజరవకున్నా జీతం కట్ కాదు. ఆ తేదీ నాడు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏడు దశల్లో జరుగనున్నాయి ఈ ఎన్నికలు. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది. ఈ ఎలక్షన్స్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దీంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 13న వేత‌నంతో కూడిన సెల‌వు మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ సెలవు నిబంధనలను కచ్చితంగా అన్ని ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు అమలు చేయాలని వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సెలవు ఇవ్వని కంపెనీలకు చెందిన ఉద్యోగులు తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. కాగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. పలు స్వచ్చంద సంస్థలు కూడా ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేలా పలు లక్కీ డ్రా ఆఫర్లు, గిఫ్టులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఓటర్లు అందరు పాల్గొనేలా చేసేందుకు మే 13న వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.

Show comments