500 Gas Cylinder Scheme:రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

500 Gas Cylinder Scheme: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరెవేర్చే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీ పథకాలు ఏడాదిలో పూర్తి చేస్తామని పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే.

500 Gas Cylinder Scheme: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరెవేర్చే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీ పథకాలు ఏడాదిలో పూర్తి చేస్తామని పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే.

గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. పదేళ్లుగా పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని పక్కన బెట్టి కాంగ్రెస్‌కి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. దీనికి ముఖ్య కారణం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ కి ఆకర్షితులైన ఓటర్లు ఆ పార్టీని గెలిపించారు.  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపైనే చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు రైతులకు రెండు లక్షల పంట రుణమాఫీ చేశారు. తాజాగా తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే..

రూ.500 గ్యాస్ సిలిండర్ పై తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు వారికి రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇందులో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు 89.99 లక్షల మంది ఉన్నారు. ప్రజాపాలనలో తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.500కే సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించి అమలుపరిచారు. అయితే రేషన్ కార్డులు కలిగి ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులు. అర్హులైన గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత సబ్సిడీ సొమ్ము ఆలస్యంగా తమ ఖాతాల్లో జమ అవుతుందని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇవి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రూ.500 గ్యాస్ సిలిండర్ అందిన రెండు రోజులకే సబ్సిడీ సొమ్మును వినియోదారుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సబ్సిడీ డబ్బులు జమ కావడానికి నాలుగైదు రోజులకు ఎక్కువే అవుతుంది. మరోవైపు ఈ పథకం ప్రారంభించినప్పుడు 39.50 లక్షల మంది ఉన్న లబ్దిదారుల సంఖ్య ప్రభుత్వ పరిపాలన కేంద్రాల్లో సవరణకు అవకాశం ఇవ్వడంతో 44.10 లక్షలకు పెరిగింది.

Show comments