వరద బాధితులకు అండగా తెలంగాణ ఉద్యోగులు.. ఏకంగా రూ.100 కోట్ల విరాళం.. !

Telangana Employees: గత నాలుగు రోజులుగా తెలంగాణలో కంటిన్యూగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

Telangana Employees: గత నాలుగు రోజులుగా తెలంగాణలో కంటిన్యూగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పూర్తిగా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో చాలా గ్రామాల్లో కమ్యూనికేషన్ లేకండా పోయింది. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని అధికారులు అంటున్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి పలువురు దాతలు వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యోగస్తులు తమ దాతృత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. తినడానికి తిండిలేక.. తాగడానికి నీళ్లు లేక కొన్ని ప్రాంతాలల్లో ప్రజలు వరదలో చిక్కుకొని బిక్కు బిక్కుమంటున్నారు. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు గొప్ప మనసు చాటుకున్నారు. వదర బాధితుల కోసం ఒకరోజు వేతనం (బైసిక్ పే) ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ మంగళవారం ప్రకటించింది. కాగా, జేఏసీ ప్రకటించిన మొత్తం విరాళం రూ.100 కోట్లు ఉంటుంది.

ఇక విరాళం ప్రకటించిన వారిలో గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, బౌట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్ దారులు ఉన్నారు. వీరంతా సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖాజానాకు జమ చేయాలని సీఎ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వి లచ్చినరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలకు ఎంతోమంది బాధపడుతున్నారని.. వారిని ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ఉంటుదని ఈ విరాళం ఇస్తున్నట్లు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అతి పెద్ద విపత్తుగా భావించి ఈ పని చేసినట్లు లచ్చిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

Show comments