iDreamPost
android-app
ios-app

ఇదేం పాపం.. 4 వేలు విరాళం ఇచ్చినందుకు.. 12 ఏళ్లు జైలు శిక్షా!

  • Published Aug 16, 2024 | 10:12 AM Updated Updated Aug 16, 2024 | 10:12 AM

Russian Women: యుద్దాలు, ప్రకృతి విపత్తుతో సరస్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వస్తు తమకు తోచినంత విరాళం ఇస్తుంటారు. అలా ఓ మహిళ విరాలం ఇచ్చిన పాపానికి జైలుపాలయ్యింది. ఎక్కడో తెలుసా?

Russian Women: యుద్దాలు, ప్రకృతి విపత్తుతో సరస్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వస్తు తమకు తోచినంత విరాళం ఇస్తుంటారు. అలా ఓ మహిళ విరాలం ఇచ్చిన పాపానికి జైలుపాలయ్యింది. ఎక్కడో తెలుసా?

  • Published Aug 16, 2024 | 10:12 AMUpdated Aug 16, 2024 | 10:12 AM
ఇదేం పాపం.. 4 వేలు విరాళం ఇచ్చినందుకు.. 12 ఏళ్లు జైలు శిక్షా!

ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే వాళ్లను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయి. దానికి తోడు సెలబ్రెటీలు, ప్రజలు విరాళల రూపంలో సహాయనిధికి అందిస్తుంటారు. అలా సాయం చేసిన వారిని దేవుళ్లలా చూస్తారు. ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఇలాంటి పరిస్థితులు ఏర్పడూనే ఉన్నాయి.. తమకు తోచిన విరాళాలు ఇచ్చి మంచి మనసు చాటుకుంటున్నారు. ఇటీవల రష్య, ఉక్రెయిన్, ఇజ్రాయల్ దేశాల్లో యుద్దం కొనసాగుతుంది.యుద్ద ప్రభావంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ప్రజల దయనీయ పరిస్థితి చూసి ఓ మహిళ జాలి చూపించింది.. వారిని ఆదుకోవడానికి తనవంతు సాయం చేసింది. కానీ అదే ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా రష్యా-ఉక్రెయిన్ ల మద్య భీకర యుద్దం జరుగుతుంది. చర్చలు జరుగుతాయని.. యుద్దం ముగిసిపోతుందని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక కారణంతో రద్దవుతూనే ఉంది. ఫలితాం నిరంతరం ఇరు దేశాల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ పై దురాక్రమనణ కొనసాగిస్తున్న రష్యా.. శత్రుదేశానికి ఎవరైనా సాయం అందించినా.. మద్దతు తెలిపినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు స్వీకరించిందని అమెరిక-రష్యన్ మహిళకు కఠిన శిక్ష విధించారు. అసలేం జరిగిందంటే.. రష్యాకు చెందిన సెనియా ఖవానా ఓ డ్యాన్సర్.. ఆమె వయసు 33 సంవత్సరాలు. ఇటీవల అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నివసిస్తుంది. ఏడాది ఫిబ్రవరిలో తన కుటుంబాన్ని కలుసుకునేందుకు సెనియా ఖవానా రష్యాకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది. రష్యా అధికారులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పలు దఫాలుగా విచారణ అనంతరం ఆమెకు కోర్టు 12 జైలు శిక్ష విధించారు.

ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా? కేవలం 51 డాలర్లు (రూ.4200) విరాళం ఇవ్వడం. అదేంటీ విరాళం ఇస్తే ఇంత కఠినంగా శిక్షిస్తారా? అన్న అనుమానం కలుగుతుంది కదా.. సెనియా ఖవానా ఉక్రెయిన్ కు అనుకూలంగా ఉన్న స్వచ్ఛంద సంస్థకు 51 డాలర్లు విరాళం ఇవ్వడమే ఆమె చేసిన తప్పుగా పరిగణించింది రష్యన్ గవర్నమెంట్. ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కోసం సెనియా విరాళాలు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం అంటుంది. ఈ క్రమంలోనే ఆమెపై దేశ ద్రోహం కింద అభియోగం మోపగా.. విచారణలో దోషిగా తేలిందని.. 12 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగిందని రష్యన్ అధికారులు తెలిపారు. అయితే తాను ఇచ్చిన విరాళం రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తారన్న విషయం తనకు తెలియదని ఖవానా వాదిస్తుంది.  మరోవైపు అమెరికా తమ పౌరులను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేస్తున్నారని విమర్శించింది.. ఖవానాను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదు. ఇక కోర్టు తీర్పును చదివే సమయంలో తెల్లటి టాప్, జీన్స్ ధరించి దీనంగా కూర్చుని చూస్తుంది సెనియా ఖవానా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.