Nidhan
Rishabh Pant Pays His Fan's College Fees: టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన ఆటతోనే గాక సేవా కార్యక్రమాలతోనూ అభిమానుల్ని సంపాదించుకుంటున్నాడు. మరోమారు అతడు తన గొప్ప మనసును చాటుకున్నాడు.
Rishabh Pant Pays His Fan's College Fees: టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన ఆటతోనే గాక సేవా కార్యక్రమాలతోనూ అభిమానుల్ని సంపాదించుకుంటున్నాడు. మరోమారు అతడు తన గొప్ప మనసును చాటుకున్నాడు.
Nidhan
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన ఆటతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. స్టన్నింగ్ కీపింగ్, థండర్ బ్యాటింగ్, స్టైలిష్ యాటిట్యూడ్‌తో తన క్రేజ్‌ను పెంచుకున్నాడు పంత్. అతడికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. యంగ్ క్రికెటర్స్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో పంత్ ఒకడని చెప్పొచ్చు. అయితే గేమ్ ద్వారానే కాదు.. సేవా కార్యక్రమాలతోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడతను. తన ఆదాయంలో నుంచి మంచి కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారికి అడిగినదే తడవుగా సాయం చేస్తుంటాడు పంత్. మరోమారు అతడు తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ అభిమాని కోసం అతడు చేసిన పనేంటో తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.
ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఓ యువకుడు తన కాలేజ్ ఫీజ్ కోసం డబ్బులు కావాలని పంత్‌ను అడిగాడు. దీంతో వెంటనే అతడికి కావాల్సిన మొత్తాన్ని అందజేశాడు పంత్. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటాడు పంత్. ఇదే క్రమంలో అతడు అభిమానులతో ముచ్చటిస్తుండగా ఓ యంగ్ ఫ్యాన్ తనకు ఆర్థిక సాయం కావాలని అడిగాడు. కాలేజ్ ఫీజ్ కోసం డబ్బులు కావాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో పంత్ అతడికి కావాల్సిన అమౌంట్‌ను పంపించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంత్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎన్ని కోట్లు ఉన్నాయనేది ముఖ్యం కాదు.. ఆపదలో ఉన్నవారికి ఇలా సాయం చేయడం కంటే గొప్ప ఆస్తి ఏదీ లేదని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలతో పంత్ మనిషిగా మరో మెట్టు ఎక్కేశాడని నెటిజన్స్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అతడు తన ఛారిటీని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడాన్ని మించినది ఏదీ లేదని.. పంత్ తన గొప్ప మనసు చాటుకోవవడాన్ని ప్రశంసించకుండా ఉండలేమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, పంత్ తన సేవా గుణాన్ని చాటుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా ఈ టీమిండియా స్టార్ పలు సందర్భాల్లో దానగుణాన్ని చాటుకున్నాడు. రీసెంట్గా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడతను. ఈ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు పంత్ అనౌన్స్ చేశాడు. యూట్యూబ్ ఇన్‌కమ్‌కు తన పర్సనల్ కాంట్రిబ్యూషన్ కూడా కలిపి మంచి పనుల కోసం ఉపయోగించనున్నట్లు అతడు తెలిపాడు. మరి.. పంత్ సేవా కార్యక్రమాలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Rishabh Pant paid a college boy fees of 90,000 INR.
– A great gesture by RP…!!! 👏❤️ pic.twitter.com/I4mPFqGzvO
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2024