iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్..దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. ఎన్ని రోజులంటే?

  • Published Sep 19, 2024 | 7:52 PM Updated Updated Sep 20, 2024 | 7:22 AM

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇంతకీ ఎన్ని రోజులంటే..?

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇంతకీ ఎన్ని రోజులంటే..?

  • Published Sep 19, 2024 | 7:52 PMUpdated Sep 20, 2024 | 7:22 AM
విద్యార్థులకు గుడ్ న్యూస్..దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. ఎన్ని రోజులంటే?

సాధారణంగా స్కూల్, కాలేజీ విద్యార్థులకు సెలవులంటే చాలు.. సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు. కానీ, విద్య సంస్థలకు సెలవులంటే.. పండగలు, పబ్లిక్ హాలిడేస్ తప్ప మరి ఏ ఇతర వాటికి ప్రత్యేకంగా సెలవులు ఉండవు. దీంతో విద్యార్థులు కూడా పండుగలు ఎప్పుడు వస్తాయా, విద్య సంస్థలకు ఎప్పుడు సెలవులు ప్రకటిస్తారనని క్యాలెండర్లు తిప్పితూ.. సెలవుల కోసం కాచుకు కూర్చుంటారు. కానీ, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్య సంస్థలకు వేసవి సెలవులు దగ్గర నుంచి వివిధ పండుగల వరకు ప్రభుత్వాలు బాగానే సెలవులు ఇస్తున్నారు.

ముఖ్యంగా ఈ ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో అయితే విద్యార్థులకు సెలవులు ఎక్కువగానే ఇచ్చారు. ఎందుకంటే.. పండుగలు, వర్షాలు కారణంగా వరుస సెలవులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సెలవులు అన్నీ అయిపోగా..మళ్లీ స్కూల్ ,కాలేజీలకు దసరా సెలవులు ఎప్పుడు ఇస్తారనని విద్యార్థులు తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ సర్కార్ విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అన్ని విద్య సంస్థలకు ఆ రోజు నుంచే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే ఈ ఏడాది దసరా సెలవులు 13 రోజుల పాటు రానున్నాయి. అనగా.. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలో అన్నీ విద్య సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి  అక్టోబర్ 15వ తేదీ నుంచి  పాఠశాలలు పునః ప్రాంరభం కానున్నాయని విద్య సంస్థ శాఖ వెల్లడించింది. అయితే  . అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి కావడంతో,  ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇకపోతే రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్ర అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది. దీంతో సెలవులు రాగానే విద్యార్థులంతా సంతోషంతో ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో దసరా సెలవులు తర్వాత.. మళ్లీ విద్య సంస్థలకు డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు ఉంటాయని, ఆ తర్వాత వచ్చే ఏడాది..  జ‌న‌వ‌రి 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఉంటాయని ప్రకటించింది. ఇక 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొనసాగుతాయని, ఆ తర్వాత ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు ప‌దో త‌ర‌గ‌తి ప్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు పూర్తి చేయనున్నట్లు తెలిపింది. 2025 మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వహించనున్నారని విద్య శాఖ అధికారులు తెలిపారు. మరి, తెలంగాణ రాష్ట్రంలో సర్కార్  అన్నీ విద్య సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.