CM Revanth Reddy: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభించనున్న CM రేవంత్‌ రెడ్డి

ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభించనున్న CM రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వ్యవసాయ రంగంలపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే రైతులకు మరో పండగలాంటి వార్త చెప్పింది తెలంగాణ సర్కార్.

CM Revanth Reddy: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వ్యవసాయ రంగంలపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే రైతులకు మరో పండగలాంటి వార్త చెప్పింది తెలంగాణ సర్కార్.

తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారని.. వారికి ఇచ్చిన ప్రతి హామీ చిత్తశుద్దితో నెరవేరుస్తామని పలు సందర్భాల్లో అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు ప్రారంభించారుర. ఇటీవల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పదివేలు నష్ట పరిహారం అందించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు. తాజాగా రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రైతులకు పండగలాంటి వార్త చెప్పిన రేవంత్ సర్కార్. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ‘సీతారామ ప్రాజెక్ట్’ ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్నో ఎకరాల సాగు నీరు అందుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సంబంధి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఆయన సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్రాగస్టు పురస్కరించుకొని  ప్రారంభిస్తారని ఈ సంద్భంగా తెలియజేశారు. ప్రస్తుతం పంపు హౌజ్ ట్రయల్స్ నడుస్తున్నాయని అన్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లా రైతుల కల సాకారం అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని జిల్లా రైతులు కోరుతున్న విషయం తెలిసిందే.   మొదటి పంప్ హౌజ్ ట్రయల్ రన్ ను గత జూన్ లో విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల రెండవ తేదీ రెండో పంప్ హౌజ్ ట్రయల్ రన్ వియజవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని ఎన్నో ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ నెల 11న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ కార్యక్రమానికి ఉత్తమ్ హాజరు కానున్నారు.

 

 

Show comments