iDreamPost
android-app
ios-app

Rythu Bharosa: రైతులకు శుభవార్త.. దసరాకు రైతు భరోసా! కొత్త రూల్స్ ఇవే!

  • Published Sep 24, 2024 | 1:49 PM Updated Updated Sep 24, 2024 | 1:49 PM

Rythu Bharosa scheme: రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని, అదే రోజున రైతుల ఖాతాల్లో తొలి విడత డబ్బులను జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ను కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం.

Rythu Bharosa scheme: రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని, అదే రోజున రైతుల ఖాతాల్లో తొలి విడత డబ్బులను జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ను కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం.

Rythu Bharosa: రైతులకు శుభవార్త.. దసరాకు రైతు భరోసా! కొత్త రూల్స్ ఇవే!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ. 2 లక్షల రుణమాఫీ పథకాన్ని మూడు విడతల్లో అమలు చేసింది. ఇక మరో రైతు సంక్షేమ పథకానికి దసరా నుంచి శ్రీకారం చుట్టనుంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా రోజున ప్రారంభించి.. అదే రోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. అక్టోబర్ తొలి వారంలో విధివిధానాలను రూపొందించి పథకానికి సంబంధించిన కొత్త రూల్స్ ను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని, అదే రోజున రైతుల ఖాతాల్లో తొలి విడత డబ్బులను జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు కలిపి రూ. 15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రేస్ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద రూ. 7, 500లను దసరా రోజున అర్హులైన రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఇందుకు అవసరం అయిన నిధులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు రూ. 10 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా.

అయితే ఈ పథకానికి సంబంధించి గత నిబంధనలు కాకుండా కొత్త రూల్స్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సాగులో లేని భూములకు, రియల్ ఎస్టేట్ స్థలాలకు, కొండలకు, గుట్టలకు రైతు భరోసా నిధులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త రూల్స్ ను తీసుకురాబోతోంద రేవంత్ సర్కార్. కేవలం సాగులో ఉన్న భూములకే ఈ పథకాన్ని వర్తింప జేయాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వ్యవసాయేతర భూములకు సాయం ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. పక్కాగా డిజిటల్ సర్వే చేసి.. పక్కాగా పంట భూములను గుర్తించి వారికి మాత్రమే సాయం అందించనుంది.

ఇక ఎన్ని ఎకరాల లోపు సాయం అందించాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయసేకరణలో అత్యధికంగా ఏడున్నర ఎకరాల లోపే సాయాన్ని అందజేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం వీటిపై చర్చలు జరుగుతున్నాయి. కాగా.. ఈసారి బడ్జెట్లో రైతు భరోసా స్కీమ్ కు రూ. 15 వేల కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంట సాగు అయినట్లు తెలుస్తోంది. మరి రైతులకు రైతు భరోసా అందిస్తున్న తెలంగాణ సర్కార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.