iDreamPost
android-app
ios-app

Revanth Reddy: అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్ష.. కొత్త పథకం ప్రారంభించిన CM రేవంత్‌

  • Published Jul 20, 2024 | 12:56 PM Updated Updated Jul 20, 2024 | 12:56 PM

Revanth Reddy-Rajiv Gandhi Civils Abhayahastam Scheme: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భారీ శుభవార్త చెప్పారు. ఒక్కొక్కరికి రూ.లక్ష అందించే సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఆ వివరాలు..

Revanth Reddy-Rajiv Gandhi Civils Abhayahastam Scheme: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భారీ శుభవార్త చెప్పారు. ఒక్కొక్కరికి రూ.లక్ష అందించే సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఆ వివరాలు..

  • Published Jul 20, 2024 | 12:56 PMUpdated Jul 20, 2024 | 12:56 PM
Revanth Reddy: అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్ష.. కొత్త పథకం ప్రారంభించిన CM రేవంత్‌

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాం‍గ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తుంది. మరీ ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా దృష్టి సారించింది. దానిలో భాగంగానే అధికారంలోకి రాగానే.. ముందుగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలను అమలు చేసిది. ఇక తాజాగా అత్యంత ముఖ్యమైన హామీ.. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలు ప్రారంభించింది. మూడు విడతల్లో.. ఆగస్టు 15 నాటికి పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే లక్ష రూపాయలలోపు రుణం తీసుకున్న వారి లోన్‌ మాఫీ చేయగా.. మరో రెండు విడతల్లో దీన్ని పూర్తిగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగానే తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. దీనిలో భాగంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతకు అది ఏ పథకం.. ఎవరు అర్హులంటే..

తెలంగాణ సర్కార్‌ మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా అర్హులైన వారికి ఏకంగా లక్ష రూపాయల నగదు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ పథకం ఎవరి కోసం అంటే.. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకుగానూ ఈ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరుతో ఈ స్కీంను తీసుకొచ్చారు. ప్రజాభవన్‌లో నేడు అనగా శనివారం నాడు.. సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. దీని ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద విద్యార్థులను ఆదుకునేందుకు గాను ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందించనుంది. ప్రిలిమ్స్ ఎంట్రెన్స్ ఆ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయి ఇంటర్వ్యూకి సన్నద్దమయ్యేవారికి ఈ సాయం అందించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధలు తెలుసని.. వారి సమస్యల పరిష్కారినికి తొలి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే.. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందని.. అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి.

జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకునే గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.