Nidhan
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం సామాన్య ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఆయన ఓ డెసిజన్ తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం సామాన్య ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఆయన ఓ డెసిజన్ తీసుకున్నారు.
Nidhan
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతున్నారు. ఇప్పటికే స్త్రీలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేయూత, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడం వంటివి అమలు చేశారు. అలాగే మిగతా హామీల అమలుకు కూడా కార్యాచరణను వేగవంతం చేశారు. అదే టైమ్‌లో మిగతా విషయాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు సీఎం రేవంత్. ఆయన తాజాగా మరో ఇంపార్టెంట్ డెసిజన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన కాన్వాయ్ వెళ్లే టైమ్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసు ఉన్నతాధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని.. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు రేవంత్. దీని వల్ల సిటీ ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని.. మినహాయింపులు కల్పించే విషయంలో ఆలోచనలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. తన కాన్వాయ్‌లోని 15 వెహికిల్స్‌ను తొమ్మిదికి తగ్గించామని, తాను ప్రయాణించే రూట్లో ట్రాఫిక్ జామ్‌లు, ట్రాఫిక్ నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మున్ముందు తాను విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుందని రేవంత్ తెలిపారు. అందుకే తాను వెళ్లే రూట్లో జనాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కోరారు.
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తన వల్ల సాధ్యం కాదని రేవంత్ పేర్కొన్నారు. సీఎం సూచన మేరకు ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించేందుకు వీలుగా తీసుకునే చర్యల మీద పోలీసులు ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ బయల్దేరే కొంత సేపటి ముందు వరకు వాహనాల రాకపోకలు యథావిధిగా అనుమతించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారట. కాగా, పోలీసు, వైద్యారోగ్య శాఖలో నియామకాల మీద శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలీసు నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రిక్రూట్‌మెంట్స్‌ను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా చేపట్టాలని సూచించారు. మరి.. తన కాన్వాయ్ కోసం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sonia Gandhi:హైదరాబాద్‌లో సెటిల్ కానున్న సోనియా గాంధీ! ఇకపై..