iDreamPost

Sonia Gandhi:హైదరాబాద్‌లో సెటిల్ కానున్న సోనియా గాంధీ! ఇకపై..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని  ఇప్పటికీ అన్నీ తానై నడిపిస్తున్న సోనియా గాంధీ త్వరలో భాగ్యనగరానికి షిష్ట్ కానున్నారు. మరి.. అందుకు బలమైన కారణం ఒకటి ఉంది. మరి.. ఆ వివరాలు..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని  ఇప్పటికీ అన్నీ తానై నడిపిస్తున్న సోనియా గాంధీ త్వరలో భాగ్యనగరానికి షిష్ట్ కానున్నారు. మరి.. అందుకు బలమైన కారణం ఒకటి ఉంది. మరి.. ఆ వివరాలు..

Sonia Gandhi:హైదరాబాద్‌లో సెటిల్ కానున్న సోనియా గాంధీ! ఇకపై..

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజీవ్ గాంధీ మరణం తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా.. అన్ని తానై నడిపించారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో సైతం ఆమె కీలకంగా వ్యవహరించారు. కొన్నేళ్ల నుంచి జాతీయ రాజకీయంలో చక్రం తిప్పుతున్నారు. ఇక ఆమె ఉండేది దేశ రాజధాని ఢిల్లీ అనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె త్వరలో హైదరాబాద్ లో సెటిల్ కానున్నారని తెలుస్తోంది. మరి.. అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీని  ఇప్పటికీ అన్నీ తానై నడిపిస్తున్న సోనియా గాంధీ త్వరలో భాగ్యనగరానికి షిష్ట్ కానున్నారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా అది నిజమేనని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఆమె కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాక  న్యూయర్క్ లో ఆమెకు చికిత్స కూడా జరిగింది. ఇప్పటికే  చికిత్స నిమిత్తం ఆమె పలుమార్లు అమెరికా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ నుంచి కొలుకున్నప్పటికీ శారీరకంగా చాలా సమస్యలు ఉన్నాయి. 70  పదుల వయస్సు దాటిన సోనియాకు ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ లో ఆమెకి చికిత్స ఇస్తున్న వైద్యులు కూడా ఇదే సలహా ఇచ్చారు. ఇదే సమయంలో ఆమె నివాసం ఉంటున్న ఢిల్లీలో కాలుష్యం ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇంకా దారుణం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఢిల్లీ ముద్ర పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సోనియా గాంధీ ఢిల్లీలో ఉంటే పొల్యూషన్ కారణంగా వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంది. అక్కడ ఉండటం ఏ రకంగానూ శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు.

అందుకే సోనియాని హైదరాబాద్ లేదా బెంగళూరుకు ఉంచేలా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచిస్తున్నారు టాక్ వినిపిస్తోంది. అందులోనూ హైదరాబాద్ అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుందనే భావనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు సిటీతో పొల్చితే హైదరాబాద్ లో కాలుష్యం తక్కువ. ముఖ్యంగా భాగ్యనగర శివారులో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. సమంగా ఉంటాయి. నగరం చుట్టుపక్కల చాలా ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. భద్రతగా పరంగా కూడా ఇబ్బంది ఉండదు. అన్నిటికీ మించి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.

అది కాక తొలి రోజుల్లో నుంచి ఆమెకు తెలంగాణపై ప్రత్యేక అభిమానం కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రియాంక, రాహుల్ సోనియాగాంధీని హైదరాబాదులో ఉంచితేనే మంచిదనే అనే అభిప్రాయంలో ఉన్నారు. మొదట హైదరాబాద్ లో ఉండి ఆమె ఆరోగ్యం కాస్త  బెటర్ అయితే అవసరమైనప్పుడు ఢిల్లీకి వెళ్లి రావచ్చని అభిప్రాయంతో ఉన్నారు. ఇదే సమయంలో సోనియా సెక్యూరిటీకి సంబంధించి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కూడా చర్చించారు. తర్వలో ఒక ఇల్లు వెతకడం… కాంగ్రెస్ అధినేత్రిని హైదరాబాద్ తరలించడం జరగనుంది. మరి.. సోనియా హైదరాబాద్ లో ఉండనున్నారనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి