P Venkatesh
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఏకంగా నెలకు రూ. 25 వేల పెన్షన్ ను ప్రకటించారు. వారిని ఆర్థికంగా ఆదుకుని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఏకంగా నెలకు రూ. 25 వేల పెన్షన్ ను ప్రకటించారు. వారిని ఆర్థికంగా ఆదుకుని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
P Venkatesh
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి గుడ్ న్యూస్ అందించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది పద్మా అవార్డులకు ఎంపికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, స్థపతి వేళు ఆనందాచారి, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్ సోమాలాల్, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిలను ఈ అవార్డులు వరించాయి.
పద్మా అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సత్కరించారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. పద్మశ్రీ గ్రహీతలకు నగదు బహుమతితో పాటు ప్రతి నెల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి వారికి అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా పద్మశ్రీ కళాకారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత.. గ్రామీణ ప్రాంతాల కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కవులను కళాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి, పెన్షన్ ను అందజేయడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి పద్మ అవార్డు గ్రహీతలకు నెల నెలా పెన్షన్ అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.25 వేల పెన్షన్, ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/2f1CFKTsQS
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2024