P Krishna
Good News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Good News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధంచిన హామీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500 సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేశారు. ఈ పథకాల కోసం గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజా పాలన అనే కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేశారు. తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్ల విషయంపై పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై పౌరసరఫరాల శాఖ సంచలన ప్రకటన చేసింది. జూన్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. మార్చి తొలి వారం నుంచి కొన్ని జిల్లాలో కోతలరు షురు అయ్యాయి. సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, వరంగల్, మహబూబ్ నగర, పెద్దపల్లి సహా మిగతా జిల్లాల్లో మూడు, నాలుగు వారాల్లో వరి కోత మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే 75.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు టార్గెట్ గా పెట్టుకున్నట్లు అధికారుల తెలిపారు.
ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాలు, నేలల వారీగా అంచనాలకు సిద్దం చేసుకొని ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు మూడు నెలల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మే నెలలో భారీ ఎత్తున వడ్డు వస్తాయని భావిస్తున్న అధికారులు.. ఈసారి సుమారు 57 శాతం ఒక్కనెలలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెలలో 19,20,846 టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ నిర్ధేశించుకుంది. ఇక మే నెలలో 45,83,558, జూన్ మాసంలో 13,36,461 టన్నులుగా సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.