iDreamPost

రైతు రుణమాఫీకి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం.. ఒకేసారి 2 లక్షలు!

2 Lakhs Loan Waiver: ఎట్టకేలకు రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతామని వెల్లడించారు. అయితే ఎట్టకేలకు ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రుణమాఫీపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21 శుక్రవారం నాడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ భేటీలో రైతు రుణమాఫీపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు ఎవరైతే రుణాలను తీసుకున్నారో ఆ రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అది కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ రైతు రుణమాఫీకి సుమారు 40 వేల కోట్లు అవసరమవుతాయని రేవంత్ సర్కార్ అంచనా వేసింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ హామీ ఇవ్వగా.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అంశం మీద కసరత్తులు చేసింది. దానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది కూడా. అయితే రైతు రుణమాఫీ మీద ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక స్పష్టత అయితే వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల తర్వాత రుణమాఫీ హామీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరు నెలల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వ యంత్రాంగం. ఈ హామీని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను సైతం సిద్ధం చేసే పనిలో ఉంది ప్రభుత్వం.

మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం వల్ల రుణమాఫీ హామీ అమలు ఆలస్యం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి.. ఆగస్టు 15 లోగా 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా పంద్రాగస్టులోపు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని పదే పదే చెప్పుకొచ్చారు. చెప్పినట్టే ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతు రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు రైతులకు సంబంధించి పంటకు మద్దతు ధర, పంట బీమా, రైతు భరోసాకు సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన విధి విధానాలను, నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి