P Krishna
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణలో కొలువుదీరిన మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణలో కొలువుదీరిన మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు.
P Krishna
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పెద్దలు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రేవంత్ రెడ్డితో పాటు 11 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కాకపోతే అధిష్టానం నుంచి మంత్రులకు సంబంధించిన శాఖల కేటాంయింపు పై స్పష్టత రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపి.. ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేబినెట్ లో కొలువుదీరిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఈ శాఖలో ఐటీ శాఖ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ శాఖ కేటాయింపు పై ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రజల్లో నమ్మకాన్ని తీసుకువచ్చాయి.. ఈ నేపథ్యంలో తమ పార్టీకి మద్దతు ఇచ్చారని సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చుతాం అని అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ది విషయంలో ఐటీ, పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. తనదైన మార్క్ చాటుకొని ఆ శాఖకే కొత్త వన్నె తెచ్చారని అంటారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాల ఏర్పాటుకు కృషి చేశారు. అంతేకాదు టి-హబ్ ద్వారా ఐటీ రంగం అభివృద్దికి పాటుపడ్డారు. ఇక తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడింది.. ఐటీ మినిష్టర్ ఎవరు అనేదానిపై గత కొన్నిరోజులగా చర్చలు జరుగుతున్నాయి. కొంతదరు మంత్రులు ఐటీ శాఖపై ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది.. నేడు కేబినేట్ మంత్రులకు శాఖలు కేటాయించారు.. ఐటీ, పరిశ్రమల శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రిగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని నియమించారు.
ఐటీ శాఖ మంత్రి దుద్దళ్ళి శ్రీధర్ బాబు విషయానికి వస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు, జయమ్మ దంపతులకు మూడవ సంతానంగా 9 మార్చి 1969, ధన్వాడ గ్రామంలో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1998లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఈయన సతీమణి పేరు శైలాజా రామయ్యర్, వీరికి ఇద్దరు సంతానం. 1999 లో తండ్రి శ్రీపాదరావుని మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు శ్రీధర్ బాబు. అదే సంవత్సరం మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఘనవిజయం సాధించారు. శ్రీధరమ్ బాబు దింగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయులుగా ఉండేవారు. 2004లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలిచారు. 2009, 2018 లో ప్రత్యర్థులపై గెలిచారు. వరుస విజయాలతో మంథని నియోజవర్గంలోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర వహించే ఐటీ శాఖను సీనియర్ నేత అయిన దుద్దిళ్ళకు కేటాయించాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో నేడు దుద్దిళ్ళకు ఐటీ శాఖ కేటాయించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.