iDreamPost
android-app
ios-app

Hyderabad నార్కోటిక్‌ పోలీసుల బంపరాఫర్‌.. ఈ పని చేస్తే.. మీకు రూ.2 లక్షలు

  • Published Jul 02, 2024 | 3:46 PM Updated Updated Jul 02, 2024 | 3:46 PM

సామాన్యులకు నగర పోలీసులు భారీ ఆఫర్‌ ఇచ్చారు. ఒకేసారి ఏకంగా 2 లక్షల రూపాయలు పొందే ఛాన్స్‌ కల్పించారు. ఇంతకు పోలీసు అధికారులు ఇచ్చిన ఆఫర్‌ ఏంటి.. దేని గురించి అంటే..

సామాన్యులకు నగర పోలీసులు భారీ ఆఫర్‌ ఇచ్చారు. ఒకేసారి ఏకంగా 2 లక్షల రూపాయలు పొందే ఛాన్స్‌ కల్పించారు. ఇంతకు పోలీసు అధికారులు ఇచ్చిన ఆఫర్‌ ఏంటి.. దేని గురించి అంటే..

  • Published Jul 02, 2024 | 3:46 PMUpdated Jul 02, 2024 | 3:46 PM
Hyderabad నార్కోటిక్‌ పోలీసుల బంపరాఫర్‌.. ఈ పని చేస్తే.. మీకు రూ.2 లక్షలు

హైదరాబాద్‌ నగరం విశ్వ నగరంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. ఎన్నో పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలు భాగ్యనగరం నుంచి తమ కార్యకలాపాలు నడిపిస్తున్నాయి. కోట్ల మందికి హైదరాబాద్‌ ఉపాధి కల్పించే కల్పతరువుగా మారింది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడ జీవనోపాధి దొరుకుతుంది. ఇవన్ని ఒక సైడ్‌. మరోవైపు నగరంలో మద్యం, డ్రగ్స్‌, రేవ్‌ పార్టీలంటూ అనేక వ్యసనాలు పుట్టుకొచ్చి యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలా మంది మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్.. మత్తు, మాదకద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ కేసులో ఎంతటి వారున్నా విడిచిపెట్టమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు.. హైదరాబాద్‌ పోలీసులు కూడా డ్రగ్స్‌ కట్టడిపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జనాలకు బంపరాఫర్‌ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు పొందే అవకాశం కల్పించారు. ఆ వివరాలు..

తెలంగాణలో భారీగా డ్రగ్స్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే.. యువత భవిష్యత్తు చిత్తవుతుంది. మాదకద్రవ్యాలు.. సమాజానికి పట్టిన పెద్ద చీడ. దాన్ని కూకటి వేళ్లతో సహా నిర్మూలించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఈ క్రమంలో తెలంగాణ నార్కోటిక్‌ పోలీసులు సామాన్యులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి భారీగా రివార్డ్‌ ప్రకటించారు. ఏకంగా 2 లక్షల రూపాయల నజరానా ఇస్తామని తెలిపారు. అయితే 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం ఇస్తేనే ఈ మొత్తం రివార్డు గెలుచుకునే అవకాం ఉంది. అంతేకాక డ్రగ్స్‌, గంజాయి గురించి ఫిర్యాదు చేసేందుకు, సమాచారం ఇచ్చేందుకు 8712671111 ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయమని సూచించారు.

ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,892 డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయని.. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.179.3 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్‌ పోలీసులు తెలిపారు. అంతేకాక జనవరి నుంచి జూన్‌ నెల చివరి వరకు రాష్ట్రవ్యాప్తంగా 679 గంజాయి కేసులు నమోదవ్వగా.. 42 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ ఏకంగా 120.41 కోట్ల రూపాయలు అని తెలిపారు.

ఇక నగరంలో డ్రగ్స్‌ కేసులతో పాటగా సైబర్‌ క్రైమ్‌ కేసులు కూడా భారీగా పెరిగాయని.. అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది గడిచిన 6 నెలల వ్యవధిలోనే సుమారు 2.52 లక్షల సైబర్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఆరు నెలల్లో సుమారు 262 కోట్ల రూపాయల మొత్తాన్ని మోసగాళ్ల నుంచి రివీల్‌ చేసి.. దాన్ని 5,191 మంది బాధితులకు తిరిగి ఇప్పించామని తెలిపారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.